విశాల్ కోసం విలన్ గా మారిన హీరో.. ఇంట్రస్టింగ్ టైటిల్ తో వస్తున్న మల్టీస్టారర్ మూవీ

స్టార్ హీరో విశాల్ చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. తాజాగా విశాల్ మల్టీస్టారర్ సినిమాతో ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు...

విశాల్ కోసం విలన్ గా మారిన హీరో.. ఇంట్రస్టింగ్ టైటిల్ తో వస్తున్న మల్టీస్టారర్ మూవీ
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 26, 2020 | 12:16 PM

స్టార్ హీరో విశాల్ చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. తాజాగా విశాల్ మల్టీస్టారర్ సినిమాతో ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు. విశాల్‌, ఆర్య క‌లిసి ఓ భారీ మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ద‌మ‌య్యారు.

గతంలో ఈ ఇద్దరు కలిసి బాల దర్శకత్వంలో ‘వాడు వీడు’ సినిమా చేశారు. ఆ సినిమాలో ఆర్య, విశాల్ తమ నటనతో ప్రేక్షకులను  ఆకట్టుకున్నారు. ఇప్పుడు విశాల్ హీరోగా నటిస్తుండగా ఆర్య నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు. విజయ్ దేవరకొండ నటించిన ‘నోటా’ సినిమాను తెరకెక్కించిన ఆనంద్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మృణాళిని హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ సినిమాకు ‘ఎనిమి’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. విశాల్ కు ఇది 30వ సినిమా కాగా ఆర్యకు ఇది 32 వ సినిమా. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత విశాల్ ‘డిటెక్టివ్’ సీక్వెల్ ను పట్టాలెక్కించనున్నాడు. అలాగే విశాల్ నటించిన ‘చక్ర’ సినిమా త్వరలో ఓటీటీ ద్వారా ప్రేక్షలకులముందుకు రానుంది.