హాలీవుడ్ హీరోని ఇన్స్ప్రెషన్‌గా తీసుకుంటున్న గా మంచువారబ్బాయి.. ‘డి అండ్ డి’ కోసం ఇలా రెడీ అవుతున్నాడట.
మంచు ఫ్యామిలీనుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విష్ణు. ఓ వైపు నటుడిగా మరో వైపు నిర్మాతగా రాణిస్తున్నారు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు విష్ణు. భారీ ఐటీ స్కామ్ నేపథ్యంలో సాగే కథతో 'మోసగాళ్లు' అనే సినిమా చేస్తున్నాడు...
మంచు ఫ్యామిలీనుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విష్ణు. ఓ వైపు నటుడిగా మరో వైపు నిర్మాతగా రాణిస్తున్నారు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు విష్ణు. భారీ ఐటీ స్కామ్ నేపథ్యంలో సాగే కథతో ‘మోసగాళ్లు’ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో అందాల చందమామ కాజల్ విష్ణుకు చెల్లిగా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నాడు.
View this post on Instagram
ఈ సినిమా తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘డి అండ్ డి’ సినిమా చేస్తున్నాడు. శ్రీను వైట్ల, విష్ణు కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ ‘ఢీ’ సినిమాకు ఇది సీక్వెల్ గా రాబోతుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకోసం విష్ణు కసరత్తులు చేస్తూ బాడీ ని రెడీ చేస్తున్నాడు.ఇందుకోసం హాలీవుడ్ హీరో డ్వేన్ జాన్సన్ నుండి ప్రేరణ పొందుతున్నానని విష్ణు తెలిపాడు.తాజాగా విష్ణు తన కూతురు ఐరా తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.’నా ఫ్రెండ్స్ నన్ను బీస్ట్ అని పిలుస్తారు.కానీ ఈ చిన్నదానికి నేను జెంటిల్ మ్యాన్ బీస్ట్.’డి అండ్ డి’కోసం వర్క్ ఔట్ చేసున్నాను.ఈ పిక్ తీసుకోడానికి నన్ను ఇన్స్పైర్ చేసిన రాక్ కి ధన్యవాదాలు’అని విష్ణు తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు.