త్వరలో ప్రేక్షకుల ముందుకు రాకీ భాయ్.. ఎదుర్కోవడానికి రెడీ అవుతున్న అధీరా.. సినీ ప్రేక్షకులకు ఇక పండగే..

సలాం రాకీ భాయ్.. సలాం రాకీ భాయ్ అంటూ కేజీఎఫ్ ద్వారా ఓ ఊపు ఊపేసాడు కన్నడ హీరో యశ్. 2018 లో విడుదలైన కేజీఎఫ్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఒక సాధారణ సినిమాగా రిలీజై అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది ఈ సినిమా. ప్రస్తుతం దీనికి సీక్వెల్‌గా ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ రెడీ అవుతోంది. అంతేకాకుండా హీరో యశ్‌కు ఈ సినిమా ద్వారా ఎంతో స్టార్‌డమ్ […]

త్వరలో ప్రేక్షకుల ముందుకు రాకీ భాయ్.. ఎదుర్కోవడానికి రెడీ అవుతున్న అధీరా.. సినీ ప్రేక్షకులకు ఇక పండగే..
Follow us
uppula Raju

|

Updated on: Nov 26, 2020 | 11:39 AM

సలాం రాకీ భాయ్.. సలాం రాకీ భాయ్ అంటూ కేజీఎఫ్ ద్వారా ఓ ఊపు ఊపేసాడు కన్నడ హీరో యశ్. 2018 లో విడుదలైన కేజీఎఫ్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఒక సాధారణ సినిమాగా రిలీజై అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది ఈ సినిమా. ప్రస్తుతం దీనికి సీక్వెల్‌గా ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ రెడీ అవుతోంది. అంతేకాకుండా హీరో యశ్‌కు ఈ సినిమా ద్వారా ఎంతో స్టార్‌డమ్ వచ్చింది. వెంటనే పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా మారిపోయారు.

‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ సినిమా భారీ తారాగణంతో సిద్ధమవుతోంది. ఇందులో రాకీభాయ్ క్యారెక్టర్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇందులో విలన్ క్యారెక్టర్ పేరు అధీరా. అయితే ఇప్పుడు అధీరాను ఢీ కొట్టడానికి రాకీభాయ్ సిద్దమవుతున్నారు. అయితే అధీరాగా బాలీవుడ్ బడా హీరో సంజయ్‌దత్ నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాకు ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాలో రవీనా టాండన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. డిసెంబర్ 6 నుంచి సంజయదత్ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. డిసెంబర్ చివరికల్లా షూటింగ్ పూర్తి చేసి సినిమా రిలీజ్ చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.