‘పుష్ప’ గురించి క్రేజీ న్యూస్‌.. బన్నీకి విలన్‌గా చియాన్ విక్రమ్‌.. త్వరలోనే అధికారిక ప్రకటన..!

స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న క్రేజీ మూవీ పుష్ప. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది.

'పుష్ప' గురించి క్రేజీ న్యూస్‌.. బన్నీకి విలన్‌గా చియాన్ విక్రమ్‌.. త్వరలోనే అధికారిక ప్రకటన..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 26, 2020 | 11:32 AM

Allu Arjun Pushpa: స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న క్రేజీ మూవీ పుష్ప. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. ఇక ఈ మూవీపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉండగా.. దీని గురించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఇందులో విలన్‌గా చియాన్ విక్రమ్ ఖరారు అయ్యారని. (నివర్ తుఫాన్‌: తిరుపతిలో పూర్తిగా నీట మునిగిన కరకంబాడి మెయిన్‌ రోడ్డు.. రాకపోకలు నిలిపివేసిన పోలీసులు)

ముందుగా ఈ మూవీలో విలన్‌గా కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతిని ఖరారు చేసుకున్నారు సుకుమార్. కానీ డేట్లు క్లాష్‌ అవ్వడంతో సేతుపతి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఇక ఆ తరువాత ఈ పాత్ర కోసం బాలీవుడ్ నటులను సంప్రదిస్తున్నట్లు టాక్ నడిచింది. మరోవైపు పుష్పలో విలన్‌గా తమిళ నటులు ఆది, బాబీ సింహా, ఆర్య, మాధవన్‌ పేర్లు కూడా వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ పాత్ర కోసం విక్రమ్‌ని సంప్రదించడం, ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయని తెలుస్తోంది. అంతేకాదు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే పుష్పకు క్రేజ్ మరింత పెరగనుంది. (చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్‌ రేసులో తమిళ డైరెక్టర్‌.. స్క్రిప్ట్‌లో పలు మార్పులు.. ఆ పాత్ర ఉండదా..!)

కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప తెరకెక్కుతోంది. ఇందులో బన్నీ సరసన రష్మిక తొలిసారిగా జత కట్టబోతోంది. ప్రకాష్ రాజ్‌, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. (కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 862 కొత్త కేసులు.. ముగ్గురు మృతి.. కోలుకున్న 961 మంది)