సైలెంట్ గా సినిమాలు కానిచ్చేస్తున్నాడు కానీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు ఈ యంగ్ హీరో

విలక్షణ నటుడు సాయి కుమార్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయి కుమార్. మొదటి సినిమా 'ప్రేమకావాలి'మంచి హిట్ అందుకోవడంతో పాటు ఆది నటనకు మంచి మార్కులు పడ్డాయి...

సైలెంట్ గా సినిమాలు కానిచ్చేస్తున్నాడు కానీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు ఈ యంగ్ హీరో
Follow us
Anil kumar poka

|

Updated on: Nov 26, 2020 | 10:57 AM

విలక్షణ నటుడు సాయి కుమార్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయి కుమార్. మొదటి సినిమా ‘ప్రేమకావాలి’మంచి హిట్ అందుకోవడంతో పాటు ఆది నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ‘లవ్లీ’ సినిమాతో మరోహిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత  ఆది నటించిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి.

‘సుకుమారుడు’ ‘రఫ్’ ‘గాలిపటం’ ‘ప్యార్ మే పడిపోయానే’ ‘నెక్స్ట్ నువ్వే’ ‘శమంతకమణి’ ‘జోడి’ ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ వంటి సినిమాల్లో నటించిన సక్సెస్  మాత్రం అందుకోలేక పోయాడు ఆది. ప్రస్తుతం ఈ కుర్ర హీరో నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. తన సినిమా అప్డేట్స్  ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్ గా కానిచ్ఛేస్తున్నాడు. ఫస్ట్ లుక్, ట్రైలర్ లాంటివి వస్తేగాని ఈ యంగ్ హీరో పలానా సినిమా చేస్తున్నాడని తెలిసే పరిస్థితి ఏర్పడిందని సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు. ఆది ప్రస్తుతం కార్తీక్ – విఘ్నేష్ దర్శకత్వంలో ‘జంగిల్’ అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. అలానే శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో ‘శశి’ అనే సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు జి.బి.కృష్ణ దర్శకత్వంలో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ను కూడా పట్టాలెక్కించనున్నాడట. మరి ఈ సినిమాలతో నైనా ఆది హిట్టు కొడతాడేమో చూడాలి.