AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్‌ రేసులో తమిళ డైరెక్టర్‌.. స్క్రిప్ట్‌లో పలు మార్పులు.. ఆ పాత్ర ఉండదా..!

మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్‌పై మళ్లీ కొత్త వార్తలు వస్తున్నాయి. ఈ రీమేక్‌ హక్కులు ఎప్పుడో తీసుకున్నా.. దర్శకుడు మాత్రం ఖరారు కావడం లేదు.

చిరంజీవి 'లూసిఫర్' రీమేక్‌ రేసులో తమిళ డైరెక్టర్‌.. స్క్రిప్ట్‌లో పలు మార్పులు.. ఆ పాత్ర ఉండదా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 26, 2020 | 10:26 AM

Share

Chiranjeevi Lucifer Remake: మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్‌పై మళ్లీ కొత్త వార్తలు వస్తున్నాయి. ఈ రీమేక్‌ హక్కులు ఎప్పుడో తీసుకున్నా.. దర్శకుడు మాత్రం ఖరారు కావడం లేదు. ముందుగా ఈ రీమేక్‌ కోసం చిరంజీవి, సుజీత్‌ని ఫైనల్ చేశారు. కానీ స్క్రిప్ట్ విషయంలో చిరును ఒప్పించలేకపోవడంతో.. సుజీత్‌ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఇక ఆ తరువాత మెగాస్టార్‌కి ఎంతో ఇష్టమైన వినాయక్‌ లైన్‌లోకి వచ్చారు. ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో సైతం చిరుతో సినిమా చేస్తున్నట్లు వినాయక్ ప్రకటించారు. అంతేకాదు పాటలు, డ్యాన్సులు లేకుండా అన్నయ్యను తానే చూడలేనని.. ఇందులో అవి రెండు కచ్చితంగా ఉంటాయని అభిమానులకు హామీ ఇచ్చారు. కానీ తాజా సమాచారం ప్రకారం వినాయక్‌ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. (కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 862 కొత్త కేసులు.. ముగ్గురు మృతి.. కోలుకున్న 961 మంది)

ఈ క్రమంలో తమిళ దర్శకుడు మోహన్ రాజా తాజాగా లూసిఫర్ రీమేక్‌ రేసులోకి వచ్చినట్లు టాక్‌. ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే మోహన్ రాజా మార్పులు మొదలుపెట్టారట. ఈ క్రమంలో హీరోయిన్ పాత్రను తీసేసినట్లు తెలుస్తోంది. అయితే లూసిఫర్ ఒరిజనల్‌లోనూ హీరోయిన్ పాత్ర ఉండదు. అలాగే పాటలు కూడా పెద్దగా ఉండవు. కానీ చిరంజీవి మాస్‌ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఇందులో హీరోయిన్ పాత్రను, పాటలను యాడ్‌ చేయాలనుకున్నారు. కానీ అలా చేస్తే మాతృక ఫీల్‌ పోతుందని భావించిన మోహన్ రాజా వాటిని తీసేశారట. ఇక మోహన్ ఐడియాకు చిరు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? లూసిఫర్ రీమేక్‌కి ఎవరు ఫైనల్ అవుతారు..? ఇందులో ఎవరెవరు నటించనున్నారు..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. (చిత్తూరు జిల్లాలో ‘నివర్’ ఎఫెక్ట్.. పొంగిపొర్లుతున్న వాగులు.. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం)

వారు శుభవార్త వింటారు.. 12 రాశుల వారికి బుధవారం దినఫలాలు
వారు శుభవార్త వింటారు.. 12 రాశుల వారికి బుధవారం దినఫలాలు
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?