మరోసారి మదర్ సెంటిమెంట్‌ను సిల్వర్ స్క్రీన్ పై రిపీట్ చేయనున్న యంగ్ హీరో
యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. చివరగా వచ్చిన 96 రీమేక్ 'జాను' నిరాశపరచడంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. చివరగా వచ్చిన 96 రీమేక్ ‘జాను’ నిరాశపరచడంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ‘ఆర్ ఎక్స్ 10’0 సినిమాతో సంచలనం సృష్టించిన అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ తోపాటు హీరో సిద్ధార్థ్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా కంటే ముందు శ్రీకారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు శర్వానంద్. వీటితోపాటు తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఓ మూవీ కూడా చేస్తున్నాడు . శర్వా కెరియర్ లో 30వ సినిమా గా వస్తున్న ఈ మూవీలో తల్లీకొడుకుల రిలేషన్ షిప్ ను అందంగా చూపించనున్నట్టు టాక్. ఈ సినిమాకు శ్రీకార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. శర్వా తల్లిగా అక్కినేని అమల నటిస్తున్నారు.