మరికొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్న చిరంజీవి.. కొరటాలకు మరో సూచన..!
మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ఆచార్య. సామాజిక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరగుతోంది
Chiranjeevi suggestion Koratala: మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ఆచార్య. సామాజిక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరగుతోంది. ఇక ఇందులో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. మామూలుగా సంక్రాంతి తరువాత నుంచి చెర్రీ ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనాలని అనుకుంటున్నారట. ఒకే షెడ్యూల్‌లో తన షూటింగ్‌ని పూర్తి చేసుకోవాలనుకున్నారట. (Bigg Boss 4 Teugu : ఈ వారం ‘నో’ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే అప్పుడేనా..!)
అయితే మరికొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్న చిరంజీవి.. మొదటగా రామ్ చరణ్ ఉండే సన్నివేశాలను పూర్తి చేయమని కొరటాలకు చెప్పారట. దీంతో కొరటాల, చెర్రీ సీన్లను షూటింగ్ చేయబోతున్నట్లు టాక్. ఇక దీనికి సంబంధించి రాజమౌళి కూడా రామ్ చరణ్‌కి పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో చెర్రీ త్వరలోనే ఆచార్య షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. (ఆదిపురుష్.. ప్రభాస్ కోసం స్పెషల్ ఫిట్‌నెస్ ట్రైనర్.. ట్రైనింగ్ ప్రారంభించనున్న రెబల్‌స్టార్)
కాగా ఈ మూవీ కథ వినేటప్పుడే ఈ పాత్రకు చెర్రీని తీసుకోవాలని.. తాను, సురేఖ అనుకున్నామని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు తామిద్దరిని ఒకే ఫ్రేమ్‌లో చూడాలన్నది సురేఖ కోరిక అని, ఈ క్రమంలో చెర్రీ కోసం రాజమౌళి నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నట్లు చిరంజీవి వివరించారు. ఇక ఈ మూవీలో చెర్రీ దాదాపు అరగంట పాటు కనిపించనున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి శిష్యుడి పాత్రలో చెర్రీ నటించనున్నాడని సమాచారం. (‘పుష్ప’ గురించి క్రేజీ న్యూస్.. బన్నీకి విలన్‌గా చియాన్ విక్రమ్.. త్వరలోనే అధికారిక ప్రకటన..!)