ఆదిపురుష్‌.. ప్రభాస్‌ కోసం స్పెషల్ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌.. ట్రైనింగ్ ప్రారంభించనున్న రెబల్‌స్టార్

రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా ఓమ్‌ రౌత్ తెరకెక్కిస్తోన్న చిత్రం ఆది పురుష్‌. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు.

ఆదిపురుష్‌.. ప్రభాస్‌ కోసం స్పెషల్ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌.. ట్రైనింగ్ ప్రారంభించనున్న రెబల్‌స్టార్
Follow us

| Edited By:

Updated on: Nov 26, 2020 | 12:14 PM

Prabhas Special Trainer: రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా ఓమ్‌ రౌత్ తెరకెక్కిస్తోన్న చిత్రం ఆది పురుష్‌. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరగుతుండగా.. వచ్చే ఏడాది నుంచి ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ క్రమంలో ప్రభాస్ కోసం స్పెషల్ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ని అపాయింట్‌ చేసినట్లు తెలుస్తోంది. (‘పుష్ప’ గురించి క్రేజీ న్యూస్‌.. బన్నీకి విలన్‌గా చియాన్ విక్రమ్‌.. త్వరలోనే అధికారిక ప్రకటన..!)

ఇందులో భాగంగా అతడు ప్రభాస్ కోసం స్ట్రిక్ట్‌ డైట్‌ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాధేశ్యామ్‌ షూటింగ్‌లో ఉన్న ప్రభాస్‌.. ఈ మధ్య కాలంలో కాస్త తగ్గారు. ఆది పురుష్‌ కోసమే ప్రభాస్ తగ్గినట్లు తెలుస్తుండగా.. అందులో రాముడి లుక్‌ కోసం త్వరలోనే ట్రైనింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. కాగా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఆది పురుష్‌ తెరకెక్కనుంది. టీసిరీస్ దాదాపు 400 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ని తెరకెక్కిస్తోన్నట్లు సమాచారం. (నివర్ తుఫాన్‌: తిరుపతిలో పూర్తిగా నీట మునిగిన కరకంబాడి మెయిన్‌ రోడ్డు.. రాకపోకలు నిలిపివేసిన పోలీసులు)

ఇక మరోవైపు ప్రభాస్-నాగ్ అశ్విన్ దర్శకత్వంలోనూ నటించనున్నారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తున్నారు. అమితాబచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లెజండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు పర్యవేక్షణ చేయనుండగా.. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్‌ ఈ మూవీని నిర్మించనున్నారు. (చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్‌ రేసులో తమిళ డైరెక్టర్‌.. స్క్రిప్ట్‌లో పలు మార్పులు.. ఆ పాత్ర ఉండదా..!)