AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంజాబీ నటుడు దీప్ సిద్దు ఏడీ ? విదేశాల నుంచి ఫేస్ బుక్ లో వీడియోలు నింపుతున్న లేడీ !

గత నెల 26 గణ తంత్ర దినోత్సవం నాడు ఢిల్లీ ఎర్రకోట వద్ద అల్లర్లకు రైతులను రెచ్ఛగొట్టాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ సింగర్..,

పంజాబీ నటుడు దీప్ సిద్దు ఏడీ ? విదేశాల నుంచి ఫేస్ బుక్ లో వీడియోలు నింపుతున్న లేడీ !
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Feb 06, 2021 | 1:00 PM

Share

గత నెల 26 గణ తంత్ర దినోత్సవం నాడు ఢిల్లీ ఎర్రకోట వద్ద అల్లర్లకు రైతులను రెచ్ఛగొట్టాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ సింగర్, నటుడు దీప్ సిధ్దు ప్రస్తుతం ఇండియాలో అయితే లేడు. విదేశాల్లో ఉంటున్నట్టు తెలుస్తోంది. అక్కడినుంచే అతనికి సంబంధించిన వీడియోలను అతడి మహిళా ఫ్రెండ్ ఒకరు ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసి పంపుతోందట. ‘పరారీ’లో  ఉన్న దీప్ సిద్దు అరెస్టుకు దారి తీసే సమాచారం ఇఛ్చినవారికి లక్ష రూపాయల రివార్డును పోలీసులు ప్రకటించారు. ఇతని ఫేస్ బుక్ అకౌంటును చూస్తున్న ఇతని ఫ్రెండ్ ఎక్కడి నుంచో ఇతడు పంపే వీడియోలను అప్ లోడ్ చేస్తున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. రిపబ్లిక్ డే నాడు ఘర్షణలను ప్రోత్సహించింది దీప్ సిద్ధుయేనని రైతు సంఘాలు ఆరోపిస్తుండగా.. తాను దేశద్రోహిని కానని, రైతు నేతలే దేశద్రోహులని సిద్దు ప్రత్యారోపణ చేస్తున్నాడు. రైతుల ఆందోళన నుంచి తనను పక్కదారి మళ్ళించడానికి వారు ప్రయత్నిస్తున్నారని కూడా అన్నాడు.

ఇలా ఉండగా ఢిల్లీ అల్లర్లకు కారకులని భావిస్తున్న జగ్ బీర్ సింగ్, బూటా సింగ్, సుఖ్ బీర్ సింగ్ తో బాటు మరొకరి అరెస్టుకు దోహదపడే సమాచారం ఇఛ్చినవారికి 50 వేల రివార్డును పోలీసులు ప్రకటించారు.ఢిల్లీ అల్లర్లలో ఘర్షణలకు పాల్పడిన రైతు నేతలు ఇంకా జైళ్లలో ఉన్నారు. మొత్తం 115 మంది ఉన్నట్టు ప్రభుత్వం ఓ జాబితా విడుదల చేసింది. వీరిని విడుదల చేయాలనీ పలు ఎంజీవోలు కోర్టులను కోరుతున్నాయి. అయితే అల్లర్లలో గాయపడిన పోలీసుల మాటేమిటని ఢిల్లీ హైకోర్టు పిటిషనర్లను ప్రశ్నిస్తోంది.  అటు-15 మంది రైతుల జాడ కనబడడంలేదని ఢిల్లీలోని  ఓ స్వచ్చంద సంస్థ తన పిల్ లో పేర్కొంది.

Read More: రాష్ట్రంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్.. కొత్త రథసారథి కోసం మొదలైన అన్వేషణ..!

Read More : రణ్‌బీర్‌ కపూర్‌తో ఉన్న ఫొటోను ప్రొఫైల్‌ ఫొటోగా పెట్టిన దీపికా పదుకొణే.. ఆ తరువాత