రణ్‌బీర్‌ కపూర్‌తో ఉన్న ఫొటోను ప్రొఫైల్‌ ఫొటోగా పెట్టిన దీపికా పదుకొణే.. ఆ తరువాత

సుశాంత్ మరణం తరువాత నెగిటివిటీని ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటీనటులు సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటున్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 9:40 am, Sun, 29 November 20
రణ్‌బీర్‌ కపూర్‌తో ఉన్న ఫొటోను ప్రొఫైల్‌ ఫొటోగా పెట్టిన దీపికా పదుకొణే.. ఆ తరువాత

Deepika Ranbir Kapoor: సుశాంత్ మరణం తరువాత నెగిటివిటీని ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటీనటులు సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఏదో అప్పుడప్పుడు మాత్రమే అందులో పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా ఇటీవల దీపికా పదుకొణే తన సోషల్‌ మీడియాలో ప్రొఫైల్ ఫొటోను మార్చారు. మాజీ ప్రియుడు రణ్‌బీర్‌తో ఉన్న ఫొటోను ఆమె పెట్టారు. అయితే అది చూసిన వారందరికీ ఎందుకు ఆ నటి ఈ ఫొటో పెట్టిందో అర్థమైంది.

ఎందుకంటే వారిద్దరు నటించిన తమాషా చిత్రం ఇటీవల 5 సంవత్సరాలను పురస్కరించుకుంది. దాన్ని గుర్తుచేసుకుంటూ దీపికా ప్రొఫైల్‌ ఫొటోను మార్చింది. అలాగే తన పేరును కూడా తారగా ఛేంజ్ చేశారు(తమాషాలో దీపికా పాత్ర పేరు). అంతేకాదు సెట్స్‌లోని కొన్ని ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అయితే ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించలేదు. కానీ రొమాంటిక్‌ సినిమాలను ఇష్టపడే వారికి ఫేవరెట్ లిస్ట్‌లో తమషా కచ్చితంగా ఉంటుంది. ఇక ఆ తరువాత మళ్లీ దీపికా ఆ ఫొటోను మార్చేశారు.

కాగా గతంలో దీపికా, రణ్‌బీర్‌ కపూర్‌ రిలేషన్‌లో ఉండేవారు. ఈ క్రమంలో రణ్‌బీర్‌ పేరును తన మెడపై టాటూగా కూడా వేయించుకున్నారు. ఆ తరువాత కొన్ని కారణాల వలన వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇక ఆ తరువాత రణ్‌వీర్‌ సింగ్‌తో దీపికా ప్రేమలో పడటం, వీరిద్దరు పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. కానీ దీపికా, రణ్‌బీర్ ఇప్పటికీ మంచి స్నేహితుల్లా కొనసాగుతున్నారు.

https://www.instagram.com/p/CIIvEPlLbwz/?utm_source=ig_embed