AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BB3: బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌ అదేనా..? చిత్ర యూనిట్‌ అధికారికంగా ఎప్పుడు స్పందిస్తుందో..

Balakrishna Boyapati Movie Name: నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషనల్‌ ఇదివరకు వచ్చిన రెండు చిత్రాలు సూపర్‌ హిట్‌ కావడంతో..

BB3: బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌ అదేనా..? చిత్ర యూనిట్‌ అధికారికంగా ఎప్పుడు స్పందిస్తుందో..
Narender Vaitla
|

Updated on: Feb 06, 2021 | 5:40 AM

Share

Balakrishna Boyapati Movie Name: నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషనల్‌ ఇదివరకు వచ్చిన రెండు చిత్రాలు సూపర్‌ హిట్‌ కావడంతో ఈ మూడో చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ అంచనాలకు తగ్గట్లుగానే బోయపాటి ఈ సినిమా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌ బాలయ్య బాబులోని నట విశ్వరూపాన్ని చూపించాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మే 28న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సినిమా విడుదల తేదీని ప్రకటించినా ఇప్పటి వరకు ఈ చిత్ర టైటిల్‌ను మాత్రం యూనిట్‌ తెలపకపోవడం గమనార్హం. దీంతో ఈ సినిమాను అంతా ‘బీబీ3’గానే సంబోధిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం చిత్ర యూనిట్‌ ‘మోనార్క్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో బాలయ్య పాత్ర తీరుకు ఈ టైటిల్‌ అయితేనే సరిపోతుందని భావిస్తోన్న బోయపాటి దీనినే ఫైనల్‌ చేసే అవకాశమున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

Also Read: భూల్‌ భులయ్యా 2 సినిమా యూనిట్‌కు షాక్‌లు ఇస్తున్న సీనియర్ నటి టబు.. పెండింగ్‌లో ఉన్న సీన్లకు నో..!

నా పెళ్లి అయ్యేలోపు అమ్మను మరో పెళ్లి చేసుకోమని అడిగాను..
నా పెళ్లి అయ్యేలోపు అమ్మను మరో పెళ్లి చేసుకోమని అడిగాను..
ఆ క్రికెట్ ఆడితేనే ఒప్పుకుంటా..వైభవ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
ఆ క్రికెట్ ఆడితేనే ఒప్పుకుంటా..వైభవ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
మీ ఇంట్లో ఉండే బెడ్‌షీట్‌ ఎన్ని రోజులకు మార్చాలో తెలుసా?
మీ ఇంట్లో ఉండే బెడ్‌షీట్‌ ఎన్ని రోజులకు మార్చాలో తెలుసా?
కొడుకు బూతు పాటపై వివాదం.. స్పందించిన నటుడు ప్రభాకర్..
కొడుకు బూతు పాటపై వివాదం.. స్పందించిన నటుడు ప్రభాకర్..
పవర్‌ప్లేలోనే భారత్‌కు పవర్ కట్..46 పరుగులకే 4 కీలక వికెట్లు
పవర్‌ప్లేలోనే భారత్‌కు పవర్ కట్..46 పరుగులకే 4 కీలక వికెట్లు
ఇంట్లో పిల్లిని పెంచుతున్నారా?.. ఈ బెనిఫిట్స్ తెలుసుకోవాల్సిందే
ఇంట్లో పిల్లిని పెంచుతున్నారా?.. ఈ బెనిఫిట్స్ తెలుసుకోవాల్సిందే
రూ. 34 వేల జీతం వచ్చే వ్యక్తి నెలకు ఎంత SIP పెట్టొచ్చు.!
రూ. 34 వేల జీతం వచ్చే వ్యక్తి నెలకు ఎంత SIP పెట్టొచ్చు.!
'ఆ తాగుబోతు అలా ప్రవర్తించడంతో'.. విశాల్‌ ప్రేయసి కామెంట్స్ వైరల్
'ఆ తాగుబోతు అలా ప్రవర్తించడంతో'.. విశాల్‌ ప్రేయసి కామెంట్స్ వైరల్
ఫ్లాపుల నుంచి బయటపడడానికి పెద్ద ప్లానే వేసిన మెగా ప్రిన్స్
ఫ్లాపుల నుంచి బయటపడడానికి పెద్ద ప్లానే వేసిన మెగా ప్రిన్స్
దేశంలో 4 రకాల హిందువులు ఉన్నారుః మోహన్ భగవత్
దేశంలో 4 రకాల హిందువులు ఉన్నారుః మోహన్ భగవత్