Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: బోనీని సిగరెట్‌ మాన్పించేందుకు శ్రీదేవీ ఏం చేసిందో తెలుసా.? ఆసక్తికర విషయాలు పంచుకున్న జాన్వీ..

శ్రీదేవి, బోనీ కపూర్‌ల మధ్య జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని నటి జాన్వీ కపూర్ పంచుకున్నారు. జాన్వీ కపూర్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం మిలీ. ప్రస్తుతం జాన్వీ ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర..

Janhvi Kapoor: బోనీని సిగరెట్‌ మాన్పించేందుకు శ్రీదేవీ ఏం చేసిందో తెలుసా.? ఆసక్తికర విషయాలు పంచుకున్న జాన్వీ..
Janhvi Interesting comments about Boney and sridevi
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 26, 2022 | 8:22 PM

శ్రీదేవి, బోనీ కపూర్‌ల మధ్య జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని నటి జాన్వీ కపూర్ పంచుకున్నారు. జాన్వీ కపూర్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం మిలీ. ప్రస్తుతం జాన్వీ ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన తల్లి శ్రీదేవీ, తండ్రి బోనీ కపూర్‌ల మధ్య జరిగిన విషయాన్ని పంచుకున్నారు.

బోనీ కపూర్‌ సిగరెట్లు కాల్చే రోజులవి. ఆ సమయంలో బోనీతో ఆ అలవాటు మాన్పించడానికి కూతుర్లు జాన్వీ, ఖుషి ఎంతో ప్రయత్నించారంటా.. ఇందులో భాగంగానే బోనీకి తెలియకుండా తెలియకుండా ప్రతిరోజూ సిగరెట్లను ముక్కలు ముక్కలుగా చేసేసేవాళ్లమని జాన్వీ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఓసారి ఏకంగా సిగరెట్‌ ప్యాకెట్‌లో టూత్‌పేస్ట్‌ వేశామని, ఎన్ని ప్రయత్నాలు చేసినా తన తండ్రి సిగరేట్ మాత్రం మానలేదని జాన్వీ తెలిపింది.

అయితే శ్రీదేవీ తీసుకున్న ఓ నిర్ణయం బోనీని సిగరెట్‌ మాన్పించేలా చేసింది. ఇంతకీ శ్రీదేవీ చేసిన ఆ పనెంటో జాన్వీ మాటల్లోనే.. ‘నాన్న ఎంతకీ సిగరెట్‌ మాన్చకపోవడంతో మా అమ్మ శాకాహారిగా మారిపోయారు. సిగరెట్లు మానకపోతే మాంసాహారాన్ని తీసుకోనని పట్టుబట్టారు. ఆమె బలహీనంగా ఉన్నారని, తప్పకుండా మాంసాహారాన్ని తీసుకోవాల్సిందేనని వైద్యులు సూచించినప్పటికీ అమ్మ అంగీకరించలేదు. నాన్న బతిమలాడినా అమ్మ వినలేదు. అలా, కొంతకాలానికి నాన్న ఆ ధూమపానాన్ని వదిలేశారు’ అని చెప్పుకొచ్చింది జాన్వీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..