సుస్మిత యవ్వారం ఇప్పటిది కాదు.. లలిత్ మోదీతో ఎప్పుడు దగ్గరయ్యారంటే..?
మాజీ చైర్మన్ లలిత్ మోదీ చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మాజీ విశ్వసుందరి సుష్మిత సేన్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను లలిత్ మోదీ షేర్ చేయడం.. అందర్నీ స్టన్ అయిపోయేలా చేసింది.

Sushmita Sen- Lalith Modi: సుస్మితా సేన్ – లలిత్ మోడీ డేటింగ్ వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 58 ఏళ్ల వయస్కులైన లలిత్ మోదీ.. 46 ఏళ్ల సుస్మితా సేన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రకటించడం గత రెండ్రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మాజీ చైర్మన్ లలిత్ మోదీ చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మాజీ విశ్వసుందరితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను లలిత్ మోదీ షేర్ చేయడం.. అందర్నీ స్టన్ అయిపోయేలా చేసింది. అయితే డేటింగ్, రిలేషన్ సుస్మితకు కొత్త కాకపోయినప్పటికీ.. తాజాగా ఆమె లలిత్ మోదీని కలవడం వెనుక మరో కారణం ఉందంటూ బాలీవుడ్ మీడియా వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ఇప్పటికే రెనీ , అలీసా అనే ఇద్దరు పిల్లలని దత్తత తీసుకుని.. వారి ఆలన పాలన చూస్తున్న సుస్మిత ఇప్పటి వరకు ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. గతంలో తను డేట్ చేసిన ఎవరూ తన ప్రియారిటీస్‌ను అర్థం చేసుకోవడం లేదంటూ మూన్నాళ్లు ముగియక ముందే వారికి బ్రేకప్ చెప్పేశారు. ఈ క్రమంలోనే ఓ ఫ్యాషన్ వీక్లో, యంగ్ మోడల్ రోహ్మాన్ శావ్లాను కలిశారు సుస్మిత. ఆ తరువాత చాలా కొద్ది రోజులకే తనతో ప్రేమలో పడి నిన్న మొన్నటి వరకు రిలేషన్లో ఉన్నారు. వారిద్దరి మధ్య ఈ మద్య గ్యాప్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే సుస్మిత తన బెటర్ హాఫ్ అని లలిత్ మోదీ చేసిన అనౌన్స్‌మెంట్‌తో బీ టౌన్‌లో చర్చనీయాంశంగా మారింది.
అయితే రోహ్మాన్‌కు సుస్మితకు మధ్య గొడవలు జరిగాయని.. వారు విడిపోయారని న్యూస్ బయటికి వచ్చినప్పటికీ సుస్మిత సేన్ రీసెంట్ గా వాటిని తోసిపుచ్చారు. రిలేషన్ అనే మాట ఎత్తకుండా.. రోహ్మాన్ ఎప్పుడూ తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ గట్టిగా చెప్పారు.




అంతేకాదు మనీలాండరింగ్ కేసులో ఇండియాను వదిలి తిరుగుతున్న లలిత్ మోదీ మీద కూడా వారు కామెంట్ చేస్తున్నారు. లలిత్ మోదీ బిజినెస్‌లో ఎలాంటి వారైనా.. తన భార్య చనిపోయే వరకు ఆమెకు చాలా లాయల్‌గా ఉన్నారని కొంత మంది బీ టౌన్ రిపోర్టర్స్ గుర్తు చేస్తున్నారు. ఆయన భార్య చనిపోయిన 2018 నుంచి 2021 చివరి వరకు సింగిల్ గానే ఉన్నారని.. ఆ తరువాతే సుస్మితతో రిలేషన్ స్టార్ట్ చేశారని వారు కోట్ చేస్తున్నారు. కాని సుస్మితకు మాత్రం ఒక సంవత్సరంలో ఇద్దరు ముగ్గురుతో డేట్ చేసిన చరిత్ర ఉందని వారు వివరిస్తున్నారు. అందుకే లలిత్ మోదీతో సుస్మిత రిలేషన్ ఎక్కువ రోజులు కొనసాగించకపోవచ్చని చెబుతున్నారు.
అంతేకాదు మరో ఇంట్రెస్టింట్ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు కొంత మంది బ్లాగర్స్ . సుస్మిత యవ్వారం ఇప్పటిది కాదని వారంటున్నారు. లలిత్ మోదీ ఐపీల్ చైర్మన్ గా ఉన్నప్పటి నంచీ.. సుస్మిత సేన్ తో పరిచయం ఉందని… అప్పుడే తనతో డేటింగ్ చేసే ప్రయత్నం చేసిందని చెబుతున్నారు. కాని లలిత్ మోదీ భార్య అడ్డుకోవడం వల్లే అది సాధ్యం కాలేదంటున్నారు. ఇక ఇప్పుడు ఆమె కూడా లేకపోవడంతో.. సుస్మిత లలిత్ మోదీకి చేరువయ్యారని చెబుతున్నారు. అయినా ఇది మూన్నాళ్ల ముచ్చటేనని.. తొందర్లోనే వారు దూరం కూడా అవుతారని కొందరు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తలు చదవండి




