AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amala Akkineni: నాగచైతన్య ఎలాంటి వాడనేది అప్పుడే తెలుసుకున్నాను!

అక్కినేనీ ఫ్యామిలీ అంటే బయటి నుంచి చూస్తే పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్. నాగార్జున, అమలా, చైతన్య, అఖిల్… నలుగురూ కలిసి నవ్వుతూ, ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటూ, ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ ఫోటో ఫ్రేమ్ వెనుక ఎంతో భావోద్వేగ గాయం, గిల్ట్ ..

Amala Akkineni: నాగచైతన్య ఎలాంటి వాడనేది అప్పుడే తెలుసుకున్నాను!
Amala Akkineni
Nikhil
|

Updated on: Nov 28, 2025 | 11:10 PM

Share

అక్కినేని ఫ్యామిలీ అంటే బయటి నుంచి చూస్తే పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్. నాగార్జున, అమల, చైతన్య, అఖిల్… నలుగురూ కలిసి నవ్వుతూ, ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటూ, ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ ఫోటో ఫ్రేమ్ వెనుక ఎంతో భావోద్వేగ గాయం, గిల్ట్, సమయం, ప్రేమ ఉందనేది అక్కినేని అమల ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు.

అమల నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. ‘చైతన్య చిన్నతనం నాకు అంతగా తెలీదు. వాళ్ల అమ్మ చెన్నైలో ఉండేది, అతను అక్కడే పెరిగాడు. హైదరాబాద్‌కు కాలేజీ కోసమే వచ్చాడు. చిన్నప్పటి నుంచి కాంటాక్ట్‌లో ఉన్నాం కానీ… నిజంగా అతన్ని తెలుసుకున్నది తను పెద్దయ్యి హైదరాబాద్‌లో స్థిరపడ్డాకే!’ అని చెప్పుకొచ్చింది. 1990లో నాగార్జున-లక్ష్మి విడాకుల తర్వాత చైతన్య తల్లితోనే చెన్నైలో పెరిగాడు. 1992లో అమలా నాగార్జునతో పెళ్లి చేసుకున్నారు. వారికి 1994లో అఖిల్‌ పుట్టాడు.

Naga Chaitanya And Amala

Naga Chaitanya And Amala

‘చైతన్య ఒక లవ్లీ హ్యూమన్ బీయింగ్. అతనిలో వయసును మించిన మెచ్యూరిటీ, జ్ఞానం ఉన్నాయి. ఎప్పుడూ తప్పు చేయడు, తండ్రి మాట వింటాడు, కానీ తన ప్లానింగ్ తనకు ఉంటుంది’ అని గర్వంగా, ప్రేమగా చెప్పింది అమల. ఇక అఖిల్‌పై ఆమె ప్రభావం మరింత బలంగా ఉంది.

‘తను నా కొడుకు కాబట్టి నా ఆలోచనలు, ఆచరణలు అతనిలో కనపడతాయి’ అని ఒప్పుకుంది. అమల మాటల్లో ఒక స్టెప్ మదర్‌గా ఆమె గాయం, గిల్ట్, ఇప్పటి అనుబంధం… మూడూ కలిసి వినిపించాయి. కానీ ఆమె ఎప్పుడూ చైతన్యను తన కొడుకు అనే అనుకుంది, అతని సక్సెస్‌కు ఎప్పుడూ చప్పట్లు కొట్టింది. చైతన్య-శోభితా పెళ్లి తర్వాత కూడా ఈ బంధం మరింత దగ్గరయిందని కనిపిస్తోంది.

కాగా, ఇటీవలే నాగ చైతన్య 39వ బర్త్‌డే స్పెషల్‌గా తన తదుపరి ప్రాజెక్ట్​ ‘వృషకర్మ’ ఫస్ట్ లుక్​ని సూపర్‌‌స్టార్​ మహేష్ బాబు రివీల్ చేశారు! కార్తీక్ దండు డైరెక్షన్‌లో మిథాలజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్​గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్, స్పర్శ్ శ్రీవాస్తవ విలన్. సుకుమార్ రైటింగ్స్, SVCC ప్రొడక్షన్. వీఎఫ్ఎక్స్ హైలైట్స్, చైతన్య క్రేజీ ఫైట్ సీక్వెన్స్‌లతో ఈ సినిమా భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఇక, నాగార్జున 100వ సినిమా ‘కింగ్ 100’తో కెరీర్లో పెద్ద మైలురాయిని చేరుకోనున్నారు! ఆర్‌ఎ కార్తీక్ డైరెక్షన్‌లో యాక్షన్-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఈ సినిమా రూపొందుతోంది.