Balakrishna : దేనికైనా ఛాలెంజ్.. నా మాట ముక్కుసూటిగా ఉంటుంది.. బాలకృష్ణ పవర్ ఫుల్ స్పీచ్..
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా మూవీ 'అఖండ 2: తాండవం'. గతంలో బ్లాక్ బస్టర్ అయిన 'అఖండ' చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘అఖండ 2: తాండవం’ ఒకటి. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిదే. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్, పోస్టర్లు అన్నీ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఇప్పుడు ఈ ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా మాసివ్ తాండవం టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్య లుక్స్, గెటప్, డైలాగ్స్, తమన్ బీజీఎమ్ హైలెట్ అయ్యాయి. అతను చెడుతో పోరాడడు, దానిని నాశనం చేస్తాడు అంటూ వచ్చిన నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో అలరిస్తోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను శుక్రవారం కూకట్ పల్లిలో నిర్వహించారు మేకర్స్.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. “దైనందన కార్యక్రమాల్లో పడిపోయి నిత్యవసర వస్తువులతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నాడు ప్రేక్షకుడు. అలాంటి సినిమా బాగుండాలి.. చలనచిత్ర పరిశ్రమలో ఉన్న పెద్దలు దీని గురించి ఆలోచించాలి. సినిమాకు భాష తేడా గానీ, ఆడమగ తేడా లేదు. కొన్ని తప్పులు చేసాను.. అప్పుడు తెలుసుకున్నాను ఆత్మను పట్టుకోవాలని. నన్ను అర్థం చేసుకునే దర్శకులతో పని చేస్తున్నాను. అది కూడా మీ కోసమే. మంచి సినిమా చేయాలి. 2021లో అఖండ ఇచ్చారు.. ప్రపంచం అంతా భయపడుతున్న సమయంలో అఖండ సినిమాను విడుదల చేసారు.. థియేటర్‌కే రారు అన్నపుడు ఆ సినిమాను ఘనవిజయం అందించారు. మంచి సినిమా వస్తే ఎప్పుడూ ఆదరిస్తారని అఖండతో నిరూపించారు. శివుడి తోడుగా చెప్తున్నాను.. ఆ త్రినేత్రుడి వీక్షణ సృష్టి నాలోకి వచ్చింది.. ఆయన త్రిశూలం నా ఆయుధానికి శక్తి శౌర్యమే ఉంటుంది.. మీరే చూస్తారు రేపు సినిమా. బోయపాటి శ్రీనుతో సినిమా చేయాలనుకుంటే మూడే నిమిషాలు మాట్లాడుకుంటాం. మాది సినిమా కాదు.. యజ్ఞం. నటన అంటే అరవడం, ఏడవడం కాదు.. యాక్టింగ్ అంటే ఇంకో ఆత్మలోకి ప్రవేశించడం. నేను పాదరసం లాంటోన్ని.. దేనికైనా ఛాలెంజ్. నా మాట ముక్కుసూటిగా ఉంటుంది.. ఎన్నో పండగలు చేసుకోబోతున్నాం ఈ సినిమాకు.. అన్ని ప్రాంతాల్లో కూడా. అప్పుడు అందరూ రండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు.
మొన్న యుపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ గారిని కలిస్తే 15 నిమిషాలు చూసి అభినందించారు. సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారన్నారు. సనాతన ధర్మం శక్తిని, పరాక్రమాన్ని చూపించాం ఈ సినిమాలో. ఛత్రపతి శివాజీ సైన్యంలో కూడా అఘోరాలు ఉండేవాళ్లు. సరిహద్దును కాపాడటానికి సైనికులు ఉంటే.. ధర్మాన్ని కాపాడటానికి ఉన్నవాళ్లే అఘోరాలు. బాలయ్య సినిమా అంటే ఉగాది పచ్చడి.. అన్ని ఉండాలి. థమన్ ఈ సినిమాకు బలం. అఖండలో పిల్లలు, ప్రకృతి జోలికి వస్తే దేవుడు ఆవహిస్తాడు.. ఇవన్నీ మితిమీరితే మనిషే దైవాన్ని ఆవహించుకుంటాడు.. ఇదే ఈ సినిమా కథ. విజయాలకు పొంగిపోను.. అపజయాలకు కుంగిపోను.. నా అభిమానులు నా వెన్నంటే ఉన్నారు. జీవహింస చేయకండి.. ఫ్యాన్స్ మీకే చెప్తున్నాను. వాటికి కూడా జీవించే హక్కు ఉంటుంది.” అని అన్నారు.
ఇవి కూడా చదవండి : Prithviraj Sukumaran : ఏంటీ.. ఈ స్టార్ హీరో భార్య టాప్ జర్నలిస్టా.. ? ఫోన్ కాల్‌తో ప్రేమకథ.. లవ్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్టులు..




