Allu Arjun: అది రూల్.. అల్లు అర్జున్‌కి బెయిల్‌ రద్దవుతుందా..? హైదరాబాద్ పోలీసుల సంచలన నిర్ణయం..

హీరో అల్లు అర్జున్‌కి బెయిల్‌ రద్దవుతుందా? సంధ్య థియేటర్ ఎపిసోడ్‌లో పోలీసులకు చిక్కిన కొత్త ఆధారాలేంటి? ఎలాంటి ప్రూఫ్స్‌తో బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ వేయబోతున్నారు? సంధ్య థియేటర్‌ ఘటనలో హీరో అల్లు అర్జున్‌కి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయనున్నారు హైదరాబాద్‌ పోలీసులు.. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.

Allu Arjun: అది రూల్.. అల్లు అర్జున్‌కి బెయిల్‌ రద్దవుతుందా..? హైదరాబాద్ పోలీసుల సంచలన నిర్ణయం..
Allu Arjun
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 23, 2024 | 8:24 PM

పుష్ప2 సినిమా ప్రిమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే.. ఆమె కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అల్లు అర్జున్ సినిమా ప్రిమియర్ షో కు సంధ్య థియేటర్ కు వెళ్లిన క్రమంలో ఇదంతా జరిగింది.. కాగా.. ఈ ఘటన అనంతరం ఎన్నో పరిణామాలు జరిగాయి.. నటుడు అల్లు అర్జున్ అరెస్టు.. ఆ తర్వాత బెయిల్ పై విడుదల, రాజకీయాలు.. వివరణలు.. ఇలా ఎన్నో ఘటనలు ఒకటి తర్వాత ఒకటి చోటుచేసుకున్నాయి.. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. సంధ్య థియేటర్‌ ఘటనలో హీరో అల్లు అర్జున్‌కి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయనున్నారు హైదరాబాద్‌ పోలీసులు.. దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు..

రేవతి మృతి కేసులో అల్లు అర్జున్ కు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్ట్‌. దీంతో జనవరి 21 వరకు అల్లు అర్జున్‌కి బెయిల్ ఉంటుంది. పోలీసులు మాత్రం ఈలోపే బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ వేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్‌కి హైకోర్ట్‌ బెయిల్‌ ఇస్తూ కొన్ని కండీషన్లు విధించింది. వాటిని పట్టించుకోకుండా ప్రెస్‌మీట్ పెట్టారని.. ఇది బెయిల్‌ రూల్స్‌కి విరుద్ధమన్నది పోలీసుల వాదనగా కనిపిస్తోంది. డిసెంబర్ 21న రాత్రి 8గంటలకు తన నివాసంలో ప్రెస్‌మీట్ పెట్టారు అల్లు అర్జున్‌. సంధ్య థియేటర్‌లో సినిమా చూసే సమయంలో తన దగ్గరకు ఏ పోలీస్ రాలేదని.. రేవతి చనిపోయిన విషయం మరుసటి రోజు తెలుసుకుని బాధపడ్డానని వివరణ ఇచ్చారు.

అది రూల్.. న్యాయ నిపుణులు ఏం చెబుతున్నారంటే..

బెయిల్‌ వచ్చినప్పుడు కేసుకి సంబంధించి ఎలాంటి కామెంట్లు చేయకూడదు.. అది రూల్ అంటున్నారు పోలీసులు. కానీ అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టి మొత్తం కేసు గురించే మాట్లాడాడని.. ఇది చట్టవిరుద్ధమంటున్నారు. న్యాయ నిపుణులు కూడా ఇదే చెబుతున్నారని గుర్తు చేస్తున్నారు. పైగా హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన విషయం మర్చిపోకూడదంటున్నారు. అలాగే అల్లు అర్జున్‌ చెప్పిందంతా అబద్దమని నిరూపిస్తూ పోలీసులు వీడియోలు కూడా రిలీజ్ చేశారు. అల్లు అర్జున్‌ ఫ్యామిలీతో సహా థియేటర్‌లోకి ఎంట్రీ.. ఆ తర్వాత జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోయిన దృశ్యాలను విడుదల చేశారు. సంధ్య థియేటర్‌కి రావొద్దని సూచించినా వెళ్లారని.. లిఖితపూర్వక రుజువులతో సహా ఆధారాలను బయటపెట్టారు. వీటితో పాటు మరిన్ని ఆధారాలను సేకరించి సుప్రీంకోర్టుకు సమర్పించి.. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేయబోతున్నట్టు తెలుస్తోంది.

కీలక ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు..

కేవలం సంధ్య థియేటర్ దగ్గర వీడియోలే కాకుండా సీసీ ఫుటేజ్‌కి సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులు సేకరిస్తున్నట్టు సమాచారం. బెయిల్ రద్దు అయ్యేలా అన్ని ప్రూప్స్‌ పిటిషన్‌కి జత చేయాలని భావిస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్‌ మామ చంద్రశేఖర్‌ రెడ్డి గాంధీభవన్‌కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. పార్టీ ఇన్‌ఛార్జ్‌ దీపాదాస్ మున్షీతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఇద్దరు కలిసి కొద్దిసేపు మాత్రమే మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. భేటీ ప్రయత్నాలపై మీడియా ప్రశ్నించినా.. చంద్రశేఖర్ సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.

ఫైనల్‌గా అల్లు అర్జున్‌ బెయిల్ పిటిషన్ రద్దుపై పోలీసుల ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి.. సుప్రీం కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి