AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కత్తి, మాంసంతో వారం రోజులు.. సినిమా కోసం ఎవరూ చేయని ధైర్యం చేసిన హీరోయిన్

దక్షిణ భారత సినిమారంగంలో అత్యంత గ్లామరస్, అత్యంత ధైర్యవంతురాలైన ఒక స్టార్ హీరోయిన్ ఉంది. తమిళం, తెలుగు, మలయాళం… మూడు పరిశ్రమల్లోనూ ఆమెకు అభిమానుల జనసైన్యం ఉంది. కానీ ఇప్పుడు ఆమె చేస్తున్న కొత్త సినిమా మాత్రం… సినీ చరిత్రలోనే ఒక ధైర్యసాహసం ..

కత్తి, మాంసంతో వారం రోజులు.. సినిమా కోసం ఎవరూ చేయని ధైర్యం చేసిన హీరోయిన్
Honey
Nikhil
|

Updated on: Nov 27, 2025 | 8:53 PM

Share

దక్షిణ భారత సినిమారంగంలో అత్యంత గ్లామరస్, అత్యంత ధైర్యవంతురాలైన ఒక స్టార్ హీరోయిన్ ఉంది. తమిళం, తెలుగు, మలయాళం… మూడు పరిశ్రమల్లోనూ ఆమెకు అభిమానుల జనసైన్యం ఉంది. కానీ ఇప్పుడు ఆమె చేస్తున్న కొత్త సినిమా మాత్రం… సినీ చరిత్రలోనే ఒక సాహసం అని చెప్పుకోవాలి.

ఈ హీరోయిన్ ఇప్పుడు ఓ సైకలాజికల్ థ్రిల్లర్‌లో నటిస్తోంది. ఆ సినిమాలో ఆమె పాత్ర – మాంసం కోసే వ్యక్తిగా నటిస్తోంది! అవును, స్క్రీన్ మీద మాత్రమే కాదు… నిజంగా కత్తి పట్టుకుని, రక్తం చిందే మాంసం ముక్కలు చేయడం ఆమె నేర్చుకుంది. ఆ పాత్ర కోసం పూర్తిగా ఒదిగిపోవాలని ఆమె ఏకంగా ఒక వారం రోజుల పాటు బుచ్చర్‌షాప్‌లో గడిపింది. కత్తి గురి, కోత పద్ధతి, శరీర భాష… అన్నీ నేర్చుకుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పడ్డాక… షాక్, ఆశ్చర్యం, వివాదం – మూడూ ఒకేసారి మొదలయ్యాయి!

ఈ చిత్రం డిసెంబర్ 6న తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ప్రమోషన్స్ ఇప్పుడు ఫుల్ జోష్‌లో సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.

Rachel

Rachel

“నా 20 ఏళ్ల కెరీర్‌లో మొదటిసారి నేను పూర్తి లెంగ్త్ టైటిల్ రోల్ చేస్తున్నాను. ఈ పాత్రలో ఒత్తిడి ఎక్కువే. కానీ ఈ భయానక పాత్రలోకి ఒదిగిపోవడానికి నేను ఒక వారంపాటు నిజంగానే మాంసం కోసే ట్రైనింగ్ తీసుకున్నాను. చాలా కష్టమైన పని… కానీ ఆ పాత్రకు అది అవసరం” అంటూ ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఈ ధైర్యం చూపించి, సినిమా కోసం ఏం చేయాలో అది చేసి చూపించిన ఆ స్టార్ హీరోయిన్ పేరు – ‘హనీ రోజ్’! ‘రాచెల్’ సినిమాతో హనీ రోజ్ కొత్త చరిత్ర రాయబోతోంది. ఈ డిసెంబర్ 6న థియేటర్లలో ఆమె ఈ భయంకర అవతారం చూడబోతున్నాం. Get ready… ఇది సాధారణ హీరోయిన్ పాత్ర కాదు, ఇది హనీ రోజ్ యొక్క బోల్డెస్ట్ రూపం!

Follow Us