Squid Game: 80 ఏళ్ల వయసులో ఇలాంటి పనులేంటయ్యా? స్క్విడ్ గేమ్ నటుడికి జైలు శిక్ష
భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ సొంతం చేసుకున్న వెబ్ సిరీస్ లలో ‘స్క్విడ్‌గేమ్’ ఒకటి. అలాంటి క్రేజీ వెబ్ సిరీస్ లో ప్లేయర్ నంబర్ వన్ పాత్రను పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కొరియన్ నటుడు ఓ యోంగ్ సు. 80 ఏళ్ల వయసులోనూ అద్భుతంగా నటించారని ప్రశంసలు వచ్చాయి.

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నటుడు ఓ యోంగ్ సు జైలు పాలయ్యాడు. ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గానూ ఆయనకు ఒక సంవత్సరం జైలు శిక్ష ఖరారు చేసింది న్యాయ స్థానం. ఓ యోంగ్ సూ నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’లో ప్లేయర్ నంబర్ 1 పాత్రను అద్భుతంగా పోషించారు. 80 ఏళ్ల వయసులోనూ తన అద్భుత నటనతో అందరి మన్ననలు అందుకున్నారు. అలాంటి ఓ యోంగ్ సు ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని 2017లో ఆయనపై కేసు నమోదైంది. తాజాగా ఈ కేసులో కోర్టు నటుడికి ఒక సంవత్సరం జైలు శిక్షను ఖరారు చేస్తూ తుది తీర్పు వెలువరించింది. ఓ యోంగ్ సు తన నేరాన్ని తిరస్కరించినప్పటికీ, కోర్టు బాధితురాలి వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు నటుడకి జైలు శిక్ష విధించింది. ఓ యోంగ్ సు గత 50 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక జూనియర్ ఆర్టిస్టుపై లైంగికంగా వేధించాడని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి బాధితురాలు భయంతో జీవిస్తోందని ఆమె న్యాయవాదులు వాదించారు. ఈ కేసు తుది విచారణ గురువారం (ఏప్రిల్ 3) జరిగింది. ఈ క్రమంలోనే ఓ యోంగ్ సుకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
“బాధితురాలికి క్షమాపణ చెప్పే బదులు, ఓయోంగ్ సు ఒక తండ్రిగా అలా చేశానని చెప్పి మరింత బాధ కలిగించాడు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి బాధితురాలు భయంతో బతుకీడుస్తోంది. బాధితురాలికి ధైర్యం ఇవ్వడానికి, భవిష్యత్తులో ఇలాంటి నేరాలను నిరోధించడానికి నిందితుడికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించాలి’ అని బాధితురాలి తరపు న్యాయవాది న్యాయ స్థానాన్ని అభ్యర్థించారు. అయితే, ఓ యోంగ్ సు ఈ ఆరోపణలన్నింటినీ ఖండించారు.
గతంలోనూ ఇలాంటి కేసులు..
2017లో ఓ గ్రామీణ ప్రాంతంలో థియేటర్ ప్రదర్శన కోసం వెళ్లిన యోంగ్ ‘i ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కానీ అక్కడ ఓ సరస్సు దాటేందుకు సహాయం కోసం మాత్రమే ఆ మహిళ చేతిని పట్టుకున్నట్లు యోంగ్ తెలిపారు. అందుకు ఆమెకు క్షమాపణలు కూడా చెప్పినట్లు తెలిపాడు. అయితే న్యాయ స్థానం బాధితురాలి వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకుంది. అలాగే యోంగ్ సూ పై గతంలో కూడా లైంగిక వేధింపుల కేసు కూడా ఉన్నట్లు న్యాయస్థానం దృష్టికి వచ్చింది. దీంతో 80 ఏళ్ల నటుడికి ఏడాది జైలు శిక్షను ఖరారు చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.