AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oppenheimer: ఆస్కార్ విన్నింగ్ ఓపెన్‌హైమర్‌లో భగవత్ గీత వివాదం ఏంటో తెలుసా..?

ఆస్కార్ అవార్డ్ వేడుకలో 'ఓపెన్‌హైమర్' సినిమా సత్తా చాటింది. ఈ చిత్రం 13 నామినేషన్లను నిలిచింది. అలాగే ఏడు ఆస్కార్‌లను గెలుచుకుంది. సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో భగవద్గీత సన్నివేశంపై భారతదేశంలోని ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Oppenheimer: ఆస్కార్ విన్నింగ్ ఓపెన్‌హైమర్‌లో భగవత్ గీత వివాదం ఏంటో తెలుసా..?
Oppenheimer
Rajeev Rayala
|

Updated on: Mar 11, 2024 | 9:15 PM

Share

గతేడాది జూలైలో క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ‘ఓపెన్‌హైమర్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించడమే కాకుండా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఆస్కార్ అవార్డ్ వేడుకలో ‘ఓపెన్‌హైమర్’ సినిమా సత్తా చాటింది. ఈ చిత్రం 13 నామినేషన్లను నిలిచింది. అలాగే ఏడు ఆస్కార్‌లను గెలుచుకుంది. సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో భగవద్గీత సన్నివేశంపై భారతదేశంలోని ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సినిమాలో ఒక ఇంటిమేట్ సన్నివేశంలో ప్రధాన నటుడి చేతిలో భగవద్గీతను చూసిన తర్వాత, నెటిజన్లు మండిపడ్డారు. భారత ప్రభుత్వ సమాచార కమిషనర్ ఉదయ్ మహూర్కర్ కూడా డైరెక్టర్లకు బహిరంగ లేఖ రాశారు.

సిలియన్ మర్ఫీ ఈ చిత్రంలో ఓపెన్‌హైమర్ పాత్రను పోషించారు. భౌతిక శాస్త్రవేత్త జె. రాబర్ట్ ఓపెన్‌హైమర్‌ను అణుబాంబు పితామహుడిగా పరిగణిస్తారు. అతను సంస్కృత భాష నేర్చుకున్నాడు అలాగే  భగవద్గీత ద్వారా బాగా ప్రభావితమయ్యాడని చెప్తుంటారు. ఒక ఇంటర్వ్యూలో జె. రాబర్ట్ మాట్లాడుతూ.. “జూలై 16, 1945 న అణ్వాయుధం మొదటి పేలుడు చూసిన తర్వాత, నాలో ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఒక ప్రాచీన హిందూ గ్రంధంలోని శ్లోకం అని తెలిపాడు. అయితే సినిమాలో సైకాలజిస్ట్ జీన్ టాట్లర్ (ఫ్లోరెన్స్ పగ్)తో రొమాంటిక్ సీన్ లో, ఆమె ఒక సంస్కృత పుస్తకంలోని ఒక పద్యం చదవమని కోరింది. టాట్లర్ ఒత్తిడితో, ఒపెన్‌హైమర్ పద్యం చదువుతాడు.

నటీనటుల ఇంటిమేట్ సన్నివేశాల సమయంలో భగవద్గీతను ఉపయోగించాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సన్నివేశం వల్ల సనాతన మతస్థుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీని పై చాలా మంది రకరకాల కామెంట్స్ చేశారు. కొందరు విమర్శిస్తుంటే.. మరికొంతమంది సినిమాలో భగవద్గీతలోని ఒక సన్నివేశం ఉంది నిజమే, కానీ అది ఏ మతాన్ని లేదా మత గ్రంథాన్ని అవమానించడానికి పెట్టలేదు అనిపిస్తుంది. సినిమా మొత్తం చూస్తే కారణం కచ్చితంగా అర్థమవుతుంది’ అని కొందరు అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.