Black Adam: మూవీ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఇండియాలో ఒక్కరోజు ముందుగానే రాక్‌ బ్లాక్‌ ఆడమ్‌.. రిలీజ్‌ ఎప్పుడంటే?

అలా ది రాక్‌ నటించిన తాజా చిత్రం బ్లాక్‌ ఆడమ్‌. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది డీసీ మూవీ లవర్స్‌ ఈ సినిమా రిలీజ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లే ఈనెల 21న ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు.

Black Adam: మూవీ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఇండియాలో ఒక్కరోజు ముందుగానే రాక్‌ బ్లాక్‌ ఆడమ్‌.. రిలీజ్‌ ఎప్పుడంటే?
Dwayne Johnson
Follow us
Basha Shek

|

Updated on: Oct 14, 2022 | 2:58 PM

హాలీవుడ్‌ స్టార్‌ హీరో ది రాక్‌ డ్వైన్‌ జాన్సన్‌కు భారత్‌తోనూ బోలెడు మంది అభిమానులు ఉన్నారు. అందుకే హాలీవుడ్‌ దర్శక నిర్మాతలు అతని చిత్రాలను ఇండియాలో పెద్ద ఎత్తున విడుదల చేస్తుంటారు. అలా ది రాక్‌ నటించిన తాజా చిత్రం బ్లాక్‌ ఆడమ్‌. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది డీసీ మూవీ లవర్స్‌ ఈ సినిమా రిలీజ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లే ఈనెల 21న ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. ఇక ఇండియా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ్‌ భాషల్లోనూ భారీ ఎత్తున బ్లాక్‌ ఆడమ్‌ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే ఇతర దేశాల్లో కంటే భారత్‌తో ఒక్క రోజు ముందుగానే అంటే అక్టోబర్‌ 20నే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

‘జంగిల్‌ క్రూస్’ ఫేం జుమీ కొల్లెట్‌ సెర్రా తెరకెక్కించిన బ్లాక్‌ ఆడమ్‌కు ఆడమ్‌ స్టికెల్‌, రోరో హైన్స్‌, షోరబ్‌ నోహిర్వాని కథను అందించారు. దిరాక్‌తో పాటు అల్డిస్‌ హోడ్జ్‌, నోహ్‌ సెంటినియో, క్రింటెస్సా స్విన్‌డెల్‌, పిర్సీ బ్రెస్నాన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ ఈ యాక్షన్‌ అడ్వెంచెరస్‌, ఫాంటసీ మూవీని తెరకెక్కించారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌తో రూపొందించిన ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్లు ఇప్పటికే అంచనాలు పెంచేశాయి. ఇప్పటికే మెక్సికోలో బ్లాక్‌ ఆడమ్‌ ప్రిమియర్‌ షోలను వేశారు. సినిమా అద్భుతంగా ఉందంటూ రివ్యూలు వచ్చేశాయి. సో.. డీసీ అభిమానులు గెట్‌ రెడీ ఫర్‌ బ్లాక్‌ ఆడమ్‌ స్ట్రామ్‌..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..