karthikeya 3: కార్తికేయ 3పై క్రేజీ అప్‌డేట్.. స్వయంగా ప్రకటించిన నిఖిల్..
చందు మొండేటి మార్క్ దర్శకత్వానికి ఫిదా అయ్యారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ల సునామిని సృష్టించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా క్లైమాక్స్‌లోనే కార్తికేయ 3 వస్తుందని మేకర్స్ హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనికి మార్గం సుగుమం అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని హీరో నిఖిల్ స్వయంగా...

నిఖిల్ హీరోగా తెరకెక్కిన కార్తికేయ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2014లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. సైన్స్‌ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇక దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన కార్తికేయ 2 కూడా మంచి విజయాన్ని నమోదుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కేవలం తెలుగుతోనే కాకుండా బాలీవుడ్‌లోనూ మంచి విజయాన్ని అందుకుంది.
చందు మొండేటి మార్క్ దర్శకత్వానికి ఫిదా అయ్యారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ల సునామిని సృష్టించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా క్లైమాక్స్‌లోనే కార్తికేయ 3 వస్తుందని మేకర్స్ హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనికి మార్గం సుగుమం అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని హీరో నిఖిల్ స్వయంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు. ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేస్తూ ఈ విషయాన్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. దీంతో కార్తికేయ మూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు.
కార్తికేయ 2 చిత్రానికి కార్తికేయ 3 చిత్రం మొదలవుతున్నట్లు తెలిపాడు హీరో నిఖిల్. ఈ విషయమై ట్వీట్ చేస్తూ.. ‘‘సరికొత్త అడ్వెంచర్‌ను సెర్చ్ చేసే పనిలో డాక్టర్ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో రానున్నాం’’ అని రాసుకొచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మరో అడ్వెంచర్ థ్రిల్లర్‌ను చూసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Dr. Karthikeya In Search of a Brand new Adventure … Soon🔥 @chandoomondeti #Karthikeya3 #Karthikeya2 #cinema #adventure pic.twitter.com/xoNeD3F2KI
— Nikhil Siddhartha (@actor_Nikhil) March 16, 2024
గతి చిత్రాలతో పోల్చితే ఈ చిత్రాన్ని మరింత భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ 2 నేషనల్ వైడ్‌గా మంచి టాక్ తెచ్చుకోవడంతో కార్తికేయ 3 చిత్రాన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈసారి బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..



