HBD Prabhas: ఆకట్టుకుంటోన్న ‘బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్’
రెబల్‌స్టార్ ప్రభాస్ అభిమానులకు పుట్టినరోజు కానుకగా ఇచ్చేశారు. బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ పేరుతో ప్రభాస్ నటిస్తోన్న రాధే శ్యామ్ నుంచి మోషన్ పోస్టర్ తాజాగా విడుదలైంది.
Beats of Radhe Shyam: రెబల్‌స్టార్ ప్రభాస్ అభిమానులకు పుట్టినరోజు కానుకగా ఇచ్చేశారు. బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ పేరుతో ప్రభాస్ నటిస్తోన్న రాధే శ్యామ్ నుంచి మోషన్ పోస్టర్ తాజాగా విడుదలైంది. విజువల్ వండర్‌గా ఎంతో ఆసక్తిగా వచ్చిన ఈ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఇందులో ప్రభాస్, పూజాహెగ్డే మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. చూస్తుంటే ఓ ట్రైన్‌లో వీరిద్దరి మధ్య జరిగే ప్రేమ కథగా రాధే శ్యామ్ తెరకెక్కినట్లు తెలుస్తోంది.
ఇక ఈ మూవీలో విక్రమాదిత్యగా ప్రభాస్ కనిపించనుండగా.. పూజా ప్రేరణగా నటిస్తున్నారు. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న రాధే శ్యామ్‌ని పలు భాషల్లో వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.
Read More:
దసరా ఉత్సవాలు.. దుర్గమ్మ తెప్పోత్సవంపై సందిగ్ధత
బ్లెస్సింగ్స్ ఇస్తున్న ఫాదర్‌కి చిన్నారి హై ఫైవ్ .. వీడియో వైరల్