అభిమాన హీరో ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ షాక్.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు
తమ అభిమాన హీరో పుట్టిన రోజు వేడుకలు పురస్కరించుకుని ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ తీగలు తగిలి ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.
తమ అభిమాన హీరో పుట్టిన రోజు వేడుకలు పురస్కరించుకుని ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ తీగలు తగిలి ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం పూనూరులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది… పూనూరు యస్ఈ కాలనీలో హీరో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్ కు గురై వంకాయలపాటి సుగుణరావు అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సుగుణకావు అక్కడిక్కడే మృతి చెందగా, బేతపూడి వాసు, చింతల వాసు, ఉసిరిపాటి అసిరి, వంకాయలపాటి సుమంత్ లు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన పూనూరు గ్రామంలో విషాదం నింపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.