అర్థరాత్రి నాలుగు నెలల బాబు కిడ్నాప్.. చేజ్ చేసి పట్టుకున్న గ్రామస్తులు

ములుగు జిల్లా వెంకటాపురంలో సీనీఫక్కీలో నాలుగు నెలల బాబు కిడ్నాప్ హైడ్రామా కలకలం సృష్టించింది.

అర్థరాత్రి నాలుగు నెలల బాబు కిడ్నాప్.. చేజ్ చేసి పట్టుకున్న గ్రామస్తులు

ములుగు జిల్లా వెంకటాపురంలో సీనీఫక్కీలో నాలుగు నెలల బాబు కిడ్నాప్ హైడ్రామా కలకలం సృష్టించింది. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు తల్లి నాగేశ్వరి కంట్లో కారం కొట్టి, దాడిచేసి పసికందును అపహరించుకు వెళ్లేందుకు యత్నించారు. విషయం గమనించిన స్ధానికులు చేజ్‌ చేసి కిడ్నాపర్లను పట్టుకున్నారు. కిడ్నాపర్ల బారి నుంచి బాబుని క్షేమంగా రక్షించి తల్లి ఒడికి చేర్చారు. అనంతరం దుండగులను పోలీసులకు అప్పగించారు.

నాలుగు నెలలక్రితం వెంటాపురానికి చెందిన నాగేశ్వరీ అనే మహిళ బాలుడిని దత్తత తీసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకుని ఇంట్లో వారు కాదనడంతో 7 నెలల గర్భిణిగా నాగేశ్వరిని స్నేహ-మహేందర్ దంపతులు ఆశ్రయించారు. కాన్పు అనంతరం నాగేశ్వరీ బాలుడిని తల్లిదండ్రులు వద్దనడంతో దత్తత తీసుకుంది. అయితే, దత్తత ఇచ్చినవారే ఈపని చేసి ఉంటారని పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు చేసింది. ఈక్రమంలో బాధితురాలు నాగేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.