AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలుడి కిడ్నాప్ మర్డర్ కేసులో పలు కీలక విషయాలు..!

సంచలనం కలిగించిన మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ మర్డర్ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ ను పోలీసులు బయటపెట్టారు.

బాలుడి కిడ్నాప్ మర్డర్ కేసులో పలు కీలక విషయాలు..!
Balaraju Goud
|

Updated on: Oct 23, 2020 | 9:30 AM

Share

సంచలనం కలిగించిన మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ మర్డర్ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ ను పోలీసులు బయటపెట్టారు. మహబూబాబాద్ బాలుడు దీక్షిత్ కిడ్నాప్, హత్య వ్యవహారంలో అనేక అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి. నిందితుడు మంద సాగర్‌కు బాలుడి బాబాయ్ మనోజ్ రెడ్డికి మధ్య సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడు పక్కా ఫ్లాన్ ప్రకారమే బాలుడిని కిడ్నాప్ చేసి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. గతంలో పోలీస్ వాహనం నడిపే ప్రైవేటు డ్రైవర్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ మర్డర్ మిస్టరీలో సాగర్‌తో పాటు ఎంతమంది ఉన్నారన్న దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు.

నిందితుడు మంద సాగర్ సంవత్సరం నుండి డింగ్ టాక్ వాయిస్ ఓవర్ ఇంటర్ నెట్ ప్రోటోకాల్ యాప్ వాడుతున్నట్లు పోలీసులు తేల్చారు. ఈ యాప్ కాల్ ద్వారానే దీక్షిత్ కిడ్నాప్ వ్యవహారం నడిపించాడు. అంతకుముందు తన గర్ల్ ఫ్రెండ్ కు ఫోన్ చేసేందుకు యాప్ ను సంవత్సరం నుండి ఉపయోగిస్తున్నాడు. అదే యాప్ ద్వారా బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. నిందితుడు మొబైల్ నెంబర్ ద్వారా కాకుండా యాప్ ద్వారా కాల్స్ చేయటంతో బాలుడి ఆచూకీ కనుక్కునేందుకు పోలీసులకు 3 రోజులు పాటు సవాలు గా మారింది.

నిందితుడు మంద సాగర్ తో దీక్షిత్ పరిచయం ఉండటం.. తెలిసిన వ్యక్తి కావడంతో పెట్రోల్ బంక్ వద్దకు వెలదమని చెప్పి బాలుడిని తీసుకెళ్లాడు మందసాగర్. తెలిసిన వ్యక్తి కావడంతో పిలవగానే అతనితో పాటు వెళ్లిపోయాడు. అప్పటికే సాగర్ స్థానిక మెడికల్ స్టోర్ నుండి రెండు నిద్రమాత్రలు కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మార్గమధ్యంలో ఒక చోట మంచినీళ్లు తాగెందుకు ఆపిన నిందితుడు… ఆ మంచి నీళ్లలోనే నిద్రమాత్రలు చేసి బాబు చేత తాగించాడు. బాబు మత్తులోకి జారుకునీ స్పృహ వచ్చేలోపు బాలుడిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య చేసిన వెంటనే దీక్షిత్ బాబాయ్ మనోజ్ రెడ్డి ఇంటికి వెళ్లాడు నిందితుడు. బాలుడి తలిదండ్రుల రియాక్షన్ చూసేందుకు వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది.

బాబు చనిపోయాక వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా దీక్షిత్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఒక చౌరస్తా దగ్గరికి బాలుడు తండ్రి రంజిత్ రెడ్డిని రమ్మని చెప్పి షాపులో నుండి రంజిత్ రెడ్డి కదలికలను నిందితుడు గమనిస్తూ వచ్చాడు. మఫ్టీలో ఉన్న పోలీసులు ఫాలో అవుతున్నారన్న అనుమానం రావడంతో.. మళ్లీ యాప్ నుండి రంజిత్ రెడ్డికి ఫోన్ చేసి బెదించాడు నిందితుడు మంద సాగర్. అయితే, సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో నిందితుడు మంద సాగర్ ను అదుపులోకి తీసుకున్నట్లు మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు.

Follow Us