AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: చిరంజీవి భార్య సురేఖకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ స్వామి ఆలయానికి బోర్డును ఏర్పాటు చేసింది. టీటీడీ తరహాలోనే కొత్త బోర్డును నియమించింది. ఈ బోర్డుకు చైర్మన్, సభ్యులు నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బోర్డులో చిరంజీవి సతీమణి సురేఖకు చోటు దక్కింది.

Telangana: చిరంజీవి భార్య సురేఖకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు..
Surekha
Venkatrao Lella
|

Updated on: Jun 30, 2026 | 11:25 PM

Share

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవస్థానానికి నూతన బోర్డును ఏర్పాటు చేసింది. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయానికి నూతన బోర్డును ఏర్పాటు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ తరహాలోనే ఈ బోర్డుకు చైర్మన్, ఇతర సభ్యులను తాజాగా నియమించింది. బోర్డు చైర్మన్‌గా ఎం.సత్యనారాయణ రెడ్డికి అవకాశం కల్పించగా.. సభ్యులు, ఎక్స్-అఫీషియో సభ్యులను కూడా నియమించింది. మొత్తం 18 మందితో కూడిన బోర్డును ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ బోర్డులో సభ్యురాలిగా మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ కొణిదెలకు చోటు దక్కింది.

బోర్డు సభ్యులు వీళ్లే..

ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిలప్పగారి విజయరాజం, తుల్ల విజయేందర్, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, కంటమాని స్వాతి, ఏం రాఘవేంద్రరావు, లక్ష్మీనారాయణ నాయక్, ది ఫౌండర్ ట్రస్టీ ఉన్నారు. ఇక ఎక్స్-అఫీషియో సభ్యులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ శాఖ కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్, యాదగిరిగుట్ట దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సీనియర్ ప్రధాన అర్చకులను నియమించారు. రెండేళ్ల పాటు ఈ బోర్డు సభ్యులు పదవిలో కొనసాగుతారు. త్వరలో కొత్త సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?