AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తీగలాగితే డొంక కదలడం అంటే ఇదే... ఒక్క బైక్‌ కోసం వెళితే ఏకంగా

తీగలాగితే డొంక కదలడం అంటే ఇదే… ఒక్క బైక్‌ కోసం వెళితే ఏకంగా

Vijay Saatha
| Edited By: |

Updated on: Jun 30, 2026 | 9:33 PM

Share

కర్నూలు జిల్లా ఆదోనిలో ఒక బైక్ చోరీ ఫిర్యాదుతో ప్రారంభమైన పోలీసుల విచారణ భారీ టూ వీలర్ దొంగతనాల ముఠాను బయటపెట్టింది. నిందితుడు మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా 35 బైకులు దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. అతడి సమాచారం మేరకు పోలీసులు వివిధ ప్రాంతాల్లో విక్రయించిన వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

తీగలాగితే డొంక కదిలింది అనే మాట మనం తరచూ వింటూ ఉంటాం. సరిగ్గా అలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో జరిగింది. ఒక్క బైక్ దొంగతనం కేసులో పోలీసులు జరిపిన విచారణలో ఏకంగా ఓ భారీ టూ వీలర్ దొంగతనాల ముఠా గుట్టు రట్టయింది. జిల్లాలోని ఆదోనిలో జరిగిన ఈ ఆసక్తికర ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆదోని పట్టణంలో పార్కింగ్ చేసిన తన బైక్ కనిపించడం లేదంటూ ఒక బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఆదోని టూ టౌన్ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో పెద్దకడబూరు మండలం చిన్న తుంబలం గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తి ప్రవర్తనపై అనుమానం వచ్చి, అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. అంతే, ఒక్క బైక్ చోరీ గురించి అడిగితే.. తానే స్వయంగా ఏకంగా 35 టూ వీలర్లను దొంగిలించినట్లు నిందితుడు మహేష్ ఒప్పుకోవడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఎక్కడెక్కడ బైకులు చోరీ చేసింది, వాటిని ఎవరెవరికి విక్రయించింది అనే వివరాలన్నింటినీ పూసగుచ్చినట్లు వివరించాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వివిధ ప్రాంతాల్లో విక్రయించిన 35 దొంగ బైకులను వెతికి పట్టుకుని, సీజ్ చేశారు. ఈ అంతర్ జిల్లా దొంగను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే బైకులు పోగొట్టుకున్న బాధితులు సరైన పత్రాలతో తమను సంప్రదించి, వాహనాలను తీసుకెళ్లవచ్చని సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్‌ బ్లాంక్‌ అవ్వాల్సిందే ఐటీ ఉద్యోగులను మించిన ఐడియా!

అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!

క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం.. క్వాలిఫికేషన్ ఏంటో తెలిస్తే షాకవుతారు!

“దయచేసి వెళ్లొద్దు”.. యజమాని పంపిన ఒక్క మెసేజ్ నెటిజన్ల మనసు దోచేసింది!

ఆ రంగంలో మహిళలకే ఎక్కువ జీతాలు

Follow Us