“దయచేసి వెళ్లొద్దు”.. యజమాని పంపిన ఒక్క మెసేజ్ నెటిజన్ల మనసు దోచేసింది!
బెంగళూరులో ఓ ఇంటి యజమాని తన అద్దెదారుకు పంపిన ఆప్యాయమైన వాట్సాప్ సందేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొత్త ఇల్లు దొరకక సెప్టెంబర్ వరకు గడువు కోరిన అద్దెదారుకు, అద్దె పెంచకుండా "దయచేసి వెళ్లకండి.. మీరు ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను" అని యజమాని స్పందించారు. ఈ ఘటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అద్దె ఇళ్ల విషయంలో యజమానులకు, అద్దెకు ఉన్న వారికి మధ్య సాధారణంగా వివాదాలొస్తుంటాయి. అయితే, బెంగళూరులో ఓ ఘటన ప్రస్తుతం అందరి హృదయాలను గెలుచుకుంటోంది. ఓ ఇంటి యజమాని తన అద్దెదారుకు పంపిన వాట్సాప్ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జెప్టో సంస్థలో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్న కృతిక కుమారి బెంగళూరులో అద్దెకు ఉంటున్నారు. జులై చివరి నాటికి ఇల్లు ఖాళీ చేస్తానని ఆమె ముందు యజమానికి సమాచారం అందించారు. అయితే, అనువైన కొత్త ఫ్లాట్ లభించకపోవడంతో సెప్టెంబర్ వరకు గడువు పొడిగించాలని ఆమె కోరారు. దీనికి ఆ యజమాని ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అద్దె పెంచకుండా ఎంతో ఆత్మీయంగా స్పందించారు. “దయచేసి వెళ్లకండి. మీరు ఇక్కడే ఎక్కువ కాలం నివసించాలని నేను కోరుకుంటున్నాను” అని బదులిచ్చారు. ఈ సంభాషణకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కృతిక ‘ఎక్స్’ వేదికగా పంచుకోవడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ఇంతటి మంచి యజమాని దొరకడం మీ అదృష్టం”, “ఈ సందేశం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది” అంటూ కామెంట్లు పెడుతున్నారు. విపరీతమైన అద్దెలు, డిపాజిట్ సమస్యలు, ఆకస్మికంగా ఇళ్లు ఖాళీ చేయించడం వంటి ప్రతికూల వార్తలతో నిలిచే బెంగళూరులో, ఇలాంటి సానుకూల వార్త రావడం విశేషమంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

