క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం.. క్వాలిఫికేషన్ ఏంటో తెలిస్తే షాకవుతారు!
భాగస్వామితో మర్యాదపూర్వకంగా బ్రేకప్ చెప్పేందుకు ‘చీఫ్ బ్రేకప్ ఆఫీసర్’ పేరుతో డేటింగ్.కామ్ సంస్థ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాన్ని ప్రకటించింది. ఎంపికైన వారికి నెలకు సుమారు రూ.2.8 లక్షల జీతం ఇవ్వనుంది. మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలతో పాటు కనీసం మూడు బ్రేకప్‌ల అనుభవం ఉండాలని సంస్థ షరతు విధించింది. ఘోస్టింగ్ సంస్కృతిని తగ్గించడమే ఈ ఉద్యోగం లక్ష్యమని తెలిపింది.
ప్రేమించడం ఎంత ఈజీనో.. ఆ బంధానికి ముగింపు పలకడం అంతకంటే కష్టం. నేరుగా బ్రేకప్ చెప్పలేక ఇబ్బందిపడే వారి కోసం ‘డేటింగ్.కామ్’ అనే ఆన్‌లైన్ డేటింగ్ సంస్థ ఒక వినూత్న ఉద్యోగాన్ని ప్రకటించింది. ‘చీఫ్ బ్రేకప్ ఆఫీసర్’ పేరుతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు 3,000 డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.2.8 లక్షలు జీతం ఇవ్వనుంది. తమ భాగస్వామితో విడిపోవాలనుకునే వారి తరఫున.. ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా, అత్యంత మర్యాదగా, సున్నితంగా బ్రేకప్ విషయాన్ని తెలియజేయడమే ఈ ఉద్యోగి ముఖ్య బాధ్యత. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, భావోద్వేగాలను అర్థం చేసుకునే సామర్థ్యం ఉండాలి. రిలేషన్‌షిప్’, ‘సిచ్యుయేషన్‌షిప్’, ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ మధ్య తేడా తెలిసి ఉండాలని షరతు విధించింది. అంతేకాదు, అభ్యర్థికి కనీసం ‘మూడు బ్రేకప్‌ల అనుభవం’ ఉండాలనే వింత షరతు కూడా పెట్టింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒక్కసారిగా బంధాన్ని తుంచేసే ‘ఘోస్టింగ్’ సంస్కృతిని తగ్గించడమే ఈ ఉద్యోగం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. జెన్-జీ, మిల్లీనియల్స్‌లో 84 శాతం మంది తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ ఘోస్టింగ్‌కు గురై మానసికంగా కుంగిపోతున్నారని, అందుకే బ్రేకప్‌ను కూడా గౌరవప్రదంగా ముగించేందుకు ఈ వినూత్న పోస్టును తెచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
“దయచేసి వెళ్లొద్దు”.. యజమాని పంపిన ఒక్క మెసేజ్ నెటిజన్ల మనసు దోచేసింది!
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్‌కు ఫిదా నెటిజన్లు
ఆ రంగంలో మహిళలకే ఎక్కువ జీతాలు
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్‌లో ఉన్నది చూసి

