రెండు హిట్లు.. ఒక అట్టర్ ఫ్లాప్.. దెబ్బకు కనిపించకుండాపోయింది
30 June 2026
Pic credit - Instagram
Rajeev
టాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది యంగ్ బ్యూటీలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ కుర్ర భామలు దూసుకుపోతున్నారు.
చిన్న సినిమాలతోనే సూపర్ హిట్స్ అందుకుంటూ అవకాశాలు అందుకుంటున్నారు. ఒక్క సినిమా రిలీజ్ అవ్వగానే మినిమమ్ మూడు సినిమాలను లైనప్ చేస్తున్నారు.
మొదటి రెండు సినిమాలు హిట్ అవ్వగానే ఈ అమ్మడు పేరు ఇండస్ట్రీలో గట్టిగా వినిపించింది. ఇక ఒక్క సినిమా డిజాస్టర్ అవ్వగానే సినిమాలకు గ్యాప్ తీసుకుంది.
పదుల సంఖ్యలో చైల్డ్ ఆర్టిస్ట్ సినిమాలుగా చేసి ఇప్పుడు హీరో, హీరోయిన్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో కావ్య కళ్యాణ్ రామ్ ఒకరు
ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. గంగోత్రి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది.
మసూద సినిమాతో హీరోయిన్ గా మారింది కావ్య కళ్యాణ్ రామ్. తొలి సినిమాతోనే హీరోయిన్ గా ఆకట్టుకుంది. తన నటనతో మెప్పించింది ఈ చిన్నది.
ఆతర్వాత వేణు దర్శకత్వంలో బలగం సినిమాలో నటించింది. బలగం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కానీ ఆతర్వాత ఆమె హీరోయిన్ గా చేసిన ఉస్తాద్ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత కావ్య సినిమాలకు గ్యాప్ తీసుకుంది. సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతుంది.