భారత్ తొలి హైడ్రోజన్ రైలులో హైదరాబాదీ మార్క్.. దీని ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
భారత రైల్వే చరిత్రలో తొలి గ్రీన్ హైడ్రోజన్ రైలు విజయవంతంగా ట్రయల్ పూర్తి చేసింది. జింద్–సోనిపట్ మార్గంలో గంటకు 120 కి.మీ. వేగాన్ని నమోదు చేసిన ఈ రైలు, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతతో సున్నా కర్బన ఉద్గారాలపై నడుస్తుంది. ఒక్కసారి ఇంధనం నింపితే 250 కి.మీ. ప్రయాణించే ఈ రైలు త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
భారత రైల్వే చరిత్రలో పర్యావరణ హిత రవాణా దిశగా ఒక నూతన అధ్యాయం మొదలైంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా రూపొందించిన ‘గ్రీన్ హైడ్రోజన్’ రైలు పట్టాలపై విజయవంతంగా పరుగెత్తింది. శనివారం నాడు ఢిల్లీ-జింద్ మార్గంలోని జింద్-సోనిపట్ సెక్షన్‌లో నిర్వహించిన ట్రయల్స్‌లో ఈ రైలు గంటకు 120 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకొని రికార్డు సృష్టించింది. అయితే, ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాక దీని వేగాన్ని గంటకు 75 కిలోమీటర్లకు పరిమితం చేయనున్నారు. హైదరాబాద్‌కు చెందిన ‘మేధా సర్వో డ్రైవ్స్’ సంస్థ కెనడా కంపెనీ భాగస్వామ్యంతో పాత డీజిల్ రైలును అత్యాధునిక హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలుగా మార్చింది. 10 కోచ్‌లు గల ఈ రైలులో 2400 కిలోవాట్ల శక్తిని ఉత్పత్తి చేసే రెండు పవర్ కార్లు ఉన్నాయి. బ్రాడ్ గేజ్‌పై నడిచే ప్రపంచంలోనే అత్యంత పొడవైన, శక్తివంతమైన హైడ్రోజన్ రైలు ఇదే కావడం విశేషం. ఈ రైలు సున్నా కర్బన ఉద్గారాలతో నడుస్తుంది. ఇందులోని ఫ్యూయల్ సెల్స్ హైడ్రోజన్‌ను ఆక్సిజన్‌తో కలపడం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియలో పొగకు బదులు కేవలం నీటి ఆవిరి, వేడి మాత్రమే వెలువడతాయి. ఒక్కసారి ఇంధనం నింపితే ఇది 250 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. రైల్వే బోర్డు ఆమోదం పొందిన ఈ రైలు, త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు ఇలాంటి రైలు.. జర్మనీ, చైనాలో మాత్రమే ఉండగా, ఈ ప్రయోగంతో మన దేశానికీ ఆ ఘనత దక్కినట్లయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే ఐటీ ఉద్యోగులను మించిన ఐడియా!
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం.. క్వాలిఫికేషన్ ఏంటో తెలిస్తే షాకవుతారు!
“దయచేసి వెళ్లొద్దు”.. యజమాని పంపిన ఒక్క మెసేజ్ నెటిజన్ల మనసు దోచేసింది!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
ప్రశాంతమైన మరణానికి మార్గం సుగమం!!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!

