Vizag: అత్తింటి ముందు గర్భిణి నిరసన ! కారణం ఇదే..!
విశాఖపట్నంలో కుటుంబ వేధింపులు భరించలేక ఓ నిండు గర్భిణి తన తల్లితో కలిసి అత్తింటి ముందు నిరసనకు దిగింది. గర్భం దాల్చిన తర్వాత అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపించింది. పుట్టినరోజు సందర్భంగా కొడుకును చూసేందుకు రాగా అత్తింటివారు తాళం వేసి వెళ్లిపోవడంతో న్యాయం చేయాలంటూ ఇంటి ముందే బైఠాయించింది.
కడుపులో మోస్తున్న బిడ్డను కాపాడుకోవడానికైనా, కళ్లముందున్న కొడుకు భవిష్యత్తు కోసమైనా అత్తింటివారే దిక్కనుకుంది ఓ గర్భిణి. కానీ ఆ అత్తిల్లే ఆమెకు నరక కూపంగా మారడంతో న్యాయం కోసం తల్లితో కలిసి నిండు గర్భిణి నిరసనకు దిగింది. విశాఖపట్నంలోని 52వ వార్డు పాత కరాసలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం వెలగవాడకు చెందిన వనజాక్షికి, విశాఖ పాత కరాసకు చెందిన శ్రీనివాసరావుతో 2018లో వివాహమైంది. వీరికి ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. కొంతకాలం కాపురం సజావుగా సాగినా, ఆ తర్వాత కుటుంబ కలహాలు మొదలయ్యాయి. పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినా భర్త, అత్తమామల వేధింపులు ఆగలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వనజాక్షి గర్భం దాల్చగా.. అబార్షన్ చేయించుకోవాలంటూ అత్తింటివారు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త వద్దే ఉంటున్న కొడుకు పుట్టినరోజు సందర్భంగా.. తన తల్లితో కలిసి వనజాక్షి అత్తింటికి వచ్చింది. అయితే ఆమె వస్తున్నట్లు తెలుసుకున్న భర్త, అత్తమామలు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. దీంతో చేసేదేం లేక, న్యాయం కావాలంటూ ఆ గర్భిణి తన తల్లితో కలిసి ఇంటి ముందే బైఠాయించింది. గర్భంతో ఉన్న మహిళను కనీసం కరుణించకుండా రోడ్డున పడేసిన అత్తింటివారి తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే ఐటీ ఉద్యోగులను మించిన ఐడియా!
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం.. క్వాలిఫికేషన్ ఏంటో తెలిస్తే షాకవుతారు!
“దయచేసి వెళ్లొద్దు”.. యజమాని పంపిన ఒక్క మెసేజ్ నెటిజన్ల మనసు దోచేసింది!
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్‌కు ఫిదా నెటిజన్లు

