AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: డైరెక్టర్ నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా? నేమ్ భలే క్యాచీగా ఉందే!

డైరెక్టర్ నందిని రెడ్డి, హీరోయిన్ సమంతల మధ్య మంచి అనుబంధం ఉంది. అందుకే ఈ కాంబినేషన్ లో ఏకంగా మూడు సినిమాలు వచ్చాయి. అందులో రెండు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. తాజాగా ఈ బ్లాక్ బస్టర్ జోడీ గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

Samantha: డైరెక్టర్ నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా? నేమ్ భలే క్యాచీగా ఉందే!
Samantha, Nandini Reddy
Basha Shek
|

Updated on: Jun 30, 2026 | 10:48 PM

Share

డైరెక్టర్ నందిని రెడ్డి, హీరోయిన్ సమంత కాంబినేషన్ లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. జబర్దస్త్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకోగా.. ఓ బేబీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక వీరి కాంబినేషన్ లో ముచ్చటగా వచ్చిన మూడో సినిమా మా ఇంటి బంగారం. జూన్ 19న రిలీజైన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటివరకు సామ్ సినిమాకు రూ. 80 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. తద్వారా తెలుగులో అత్యధిక కలెక్షన్లు సాధించిన లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో మా ఇంటి బంగారం టాప్ 3 ప్లేసులో నిలిచింది. మొదటి రెండు స్థానాల్లో రుద్రమ దేవి (87 కోట్లు), మహానటి (84) ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా జోరును చూస్తుంటే త్వరలోనే మా ఇంటి బంగారం సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇంతకు ముందు కూడా సామ్ లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించింది. కానీ ఇందులో ఆమె కేవలం కామెడీ, ఎమోషన్లతో మాత్రమే కాకుండా.. యాక్షన్‌ సన్నివేశాల్లోనూ అదరగొట్టింది. సినిమాలో ఆ సీక్వెన్సులు హైలైట్‌గా నిలిచాయి. ఈ క్రమంలో మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్లలో మాట్లాడిన నందిని రెడ్డి సామ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

‘సమంత పెద్ద స్టార్ అని నమ్మే నేను ఆమెతో యాక్షన్ సీన్స్ చేయించాను. హాలీవుడ్ లో యాక్షన్ ఘట్టాలకు టామ్ క్రూయిజ్ పెట్టింది పేరు కాబట్టి.. ఆయన లాగే సమంత కూడా కూడా ఆయన లాగా యాక్షన్ సీక్వెన్సులను అద్భుతంగా పండించగలదని నేను గట్టిగా నమ్మాను. ఆ ఉద్దేశంతోనే నేను నా ఫోన్ లో సమంత పేరును ‘సామ్ క్రూయిజ్’ అని సేవ్ చేసుకున్నాను’ అని నందిని రెడ్డి వెల్లడించింది. ప్రస్తుతం ఈ లేడీ డైరెక్టర్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

వైజాగ్ లో సమంత మా ఇంటి బంగారం సక్సెస్ మీట్.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇల్లు కట్టేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు.. నిపుణులు చెప్పిన సూచనలు!
ఇల్లు కట్టేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు.. నిపుణులు చెప్పిన సూచనలు!
వైద్యరంగంలో గ్లోబల్ భాగస్వామ్యమే కీలకం: నాసిర్ అలీ ఖాన్
వైద్యరంగంలో గ్లోబల్ భాగస్వామ్యమే కీలకం: నాసిర్ అలీ ఖాన్
ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు
ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు
కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..
కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..
కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం
కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం
శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!
శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్
ఉడకబెట్టిన గుడ్లు ఎంతసేపు బయట ఉంచవచ్చు? నిపుణుల సూచనలు!
ఉడకబెట్టిన గుడ్లు ఎంతసేపు బయట ఉంచవచ్చు? నిపుణుల సూచనలు!
గుండె వేగం, నిద్ర.. వెల్‌నెస్ బ్యాండ్ ప్రత్యేకతలు ఇవే
గుండె వేగం, నిద్ర.. వెల్‌నెస్ బ్యాండ్ ప్రత్యేకతలు ఇవే
అంకిత భకత్‌, కీర్తి, కుంకుమ్‌ దుమ్మురేపారు.. భారత్‌కు మరో గోల్డ్
అంకిత భకత్‌, కీర్తి, కుంకుమ్‌ దుమ్మురేపారు.. భారత్‌కు మరో గోల్డ్