AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ‘సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో పడుకోవాలన్నారు’.. సంచలన విషయాలు బయట పెట్టిన సీరియల్ హీరోయిన్

బుల్లితెరపై బిజీ బిజీగా ఉండే నటీమణుల్లో ఈ బ్యూటీ కూడా ఒకరు. టీవీ సీరియల్స్, రియాలిటీ షోలతో పాటు అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తుంటుందీ అందాల తార. తాజాగా ఈ సీరియల్ హీరోయిన్ ఒక ప్రముఖ పాడ్‌కాస్ట్‌లో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి మాట్లాడింది.

Actress: 'సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో పడుకోవాలన్నారు'.. సంచలన విషయాలు బయట పెట్టిన సీరియల్ హీరోయిన్
Bollywood Actress
Basha Shek
|

Updated on: Jun 30, 2026 | 7:15 AM

Share

బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి, నటి అంకితా లోఖండే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పవిత్ర రిష్తా’ సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార. ఇప్పుడు ఆమె టీవీ సీరియల్స్, రియాలిటీ షోలు, అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తోంది. 2021లో వ్యాపారవేత్త వివేక్ జైన్‌ను వివాహం చేసుకున్న అంకిత, తరచుగా పాడ్‌కాస్ట్‌లు, ఇంటర్వ్యూలకు హాజరవుతుంటుంది. ఇప్పుడు, అంకితా లోఖండే ఒక ప్రముఖ పాడ్‌కాస్ట్‌లో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి మాట్లాడింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో అది తనకు ఒక చేదు అనుభవం అని వాపోయింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో చాలా కాలం పాటు ప్రేమలో ఉన్న అంకితా లోఖండే, తాను ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, “నేను ముంబైలో ఒక సౌత్ సినిమా కోసం ఆడిషన్ ఇచ్చాను. అప్పుడు నా వయసు ఇంకా 19 ఏళ్లే. సినిమాల్లో నటిగా, హీరోయిన్‌గా ఎదగాలనే కోరికలు నాకు చాలా ఉండేవి. అందుకే నేను కూడా ఒక సౌత్ ఇండియన్ సినిమా కోసం ఆడిషన్ ఇచ్చాను. కానీ ఆడిషన్ తీసుకున్న వ్యక్తి, ‘నువ్వు రాజీ పడాలి’ అని అన్నాడు. అతను ఏం అడుగుతున్నాడో నాకు అప్పటికే అర్థమైంది, కానీ ఆ మాట అతని నోటి నుంచే రావాలని, నాకు ఏమీ తెలియనట్టు నటించాను. నేను బాగా నటిస్తానని, అందరితో స్నేహంగా ఉంటానని చెప్పాను’

‘చివరికి, అతను సూటిగా, ‘నువ్వు నిర్మాతతో పడుకోవాలి’ అని అన్నాడు. అప్పుడునేను ఆయనకు ఓ మాట చెప్పాను. సినిమా ఆఫర్ కోసం పడుకొనే అమ్మాయిని కాదు. నేను అలాంటి వాటికి లొంగను. టాలెంట్‌ను నమ్ముకొని వచ్చాను’ అని ముఖం మీదే చెప్పాను. దాంతో మీరు అలా అనుకోవద్దు. ప్రామిస్ నేను ఈ సినిమాలో ఆఫర్ ఇస్తాను అని అతడు తగ్గాడు. దాంతో మీరు ఈ సినిమాలో ఆఫర్ ఇచ్చినా నేను చేయను. నాకు ఈ సినిమా అవసరం లేదు అని చెప్పి బయటకు వచ్చాను’ అని అంకిత అప్పటి చేదు అనుభవాన్ని గుర్తు తెచ్చుకుంది.

ఇవి కూడా చదవండి

అంకిత, సుశాంత్ సింగ్ ‘పవిత్ర రిష్తా’ సీరియల్‌లో కలిసి నటించారు. అప్పటి నుంచే వారిద్దరూ డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. 2016లో వారు తమ వివాహాన్ని ప్రకటించారు. కానీ అదే సంవత్సరంలో విడిపోయారు. ఆ తర్వాత, 2021లో, అంకిత వ్యాపారవేత్త విక్కీ జైన్‌ను వివాహం చేసుకుంది. అనంతరం, వారిద్దరూ కలిసి బిగ్ బాస్ షోకి కూడా వెళ్లారు. ఇప్పటికీ, అంకిత వివిధ రియాలిటీ షోలలో కనిపిస్తూనే ఉంది.

అంకిత లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us