AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhagyaraj: భాగ్యరాజ్ మొదటి భార్య కూడా నటి అని మీకు తెలుసా? పాపం పెళ్లైన 2 ఏళ్లకే ఎలా చనిపోయారంటే?

హీరోగా, సహాయక నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ప్రత్యేకించి స్క్రీన్ ప్లే రైటర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు భాగ్యరాజ్. అయితే ఆయన వ్యక్తిగత గురించి చాలా మందికి తెలియదు. ముఖ్యంగా భాగ్యరాజ్ మొదటి భార్య పూర్ణిమ అకాల మరణం గురించి..

Bhagyaraj: భాగ్యరాజ్ మొదటి భార్య కూడా నటి అని మీకు తెలుసా? పాపం పెళ్లైన 2 ఏళ్లకే ఎలా చనిపోయారంటే?
Bhagyaraj Family
Basha Shek
|

Updated on: Jun 28, 2026 | 5:38 PM

Share

భాగ్యరాజ్.. పేరుకు తమిళ సినిమాకు చెందిన వారే అయినా తెలుగు ఆడియెన్స్ కు కూడా ఈ నటుడు బాగా పరిచయం. హీరోగా, సహాయక నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ప్రత్యేకించి స్క్రీన్ ప్లే రైటర్ గా మల్టీపుల్ పర్సనాలిటీగా గుర్తింపు తెచ్చుకున్నారు భాగ్యరాజ్. తన ప్రతిభకు ప్రతీకగా పలు అవార్డులు, ప్రశంసలు అందుకున్నారీ లెజెండరీ యాక్టర్. సినిమాల సంగతి పక్కన పెడితే.. భాగ్యరాజ్ వ్యక్తిగత జీవితంలో చాలామందికి తెలియని ఓ విషాద అధ్యాయం ఉంది. ఇప్పుడు ఆయన భార్యగా నటి పూర్ణిమ అందరికీ తెలిసినా, ఆమె కంటే ముందు భాగ్యారాజ్ నటి ప్రవీణను పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లైన రెండేళ్లకే ప్రవీణ చనిపోయింది. 1970ల మధ్యలో ప్రవీణ నటిగా పరిచయమయ్యారు. హీరోయిన్ గా కాకపోయినా చిన్న చిన్న పాత్రలతోనే బాగా ఫేమస్ అయిపోయారు. తమిళంలోనే కాకుండా మలయాళం, తెలుగు, కన్నడ సినిమాల్లోనూ నటించారామె. ఇలా చిన్న చిన్న పాత్రలు పోషిస్తున్న సమయంలోనే ప్రవీణకు భాగ్యరాజ్‌తో స్నేహం ఏర్పడింది. 1980లో రిలీజైన ‘బామ రుక్మణి’ సినిమాలో ప్రవీణ సెకెండ్ హీరోయిన్ గా నటించింది. ఇదే సమయంలో భాగ్యరాజ్ కు ప్రవీణతో పరిచయమైంది. ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ఆ తర్వాత ఇద్దరి మనసులు కావడంతో ప్రేమికులుగా మారారు.

చాలా కాలం ప్రేమించుకున్న భాగ్యరాజ్, ప్రవీణ 1981లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ప్రవీణ సినిమాల్లో నటించారు. ఓ వైపు సినిమాలు, మరోవైపు సంసార జీవితం.. ఇలా ఎంతో ఆనందంగా జీవించారు భాగ్యరాజ్- ప్రవీణ్. అయితే ఈ ఆనందం ఎక్కువ కాలం నిలలేదు. పెళ్లయిన రెండేళ్లకే అంటే 1983లో ప్రవీణకు పచ్చకామెర్లు సోకాయి. చికిత్స తీసుకున్నా రోజు రోజుకు ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. చివరకు కేవలం 25 ఏళ్ల వయసులోనే ప్రవీణ కన్నుమూశారు. ఈ ఘటన భాగ్యరాజ్‌ను మానసికంగా కుంగదీసింది.

ఇవి కూడా చదవండి

ప్రవీణ మరణం తర్వాత చాలా ఏళ్లకు భాగ్యరాజ్ నటి పూర్ణిమను పెళ్లి చేసుకున్నారు.  పూర్ణిమ కూడా పలు సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా కాకపోయినా తన మంచి పాత్రలు పోషించింది. ఇక భాగ్యరాజ్- పూర్ణిమకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు కొడుకు శంతను భాగ్యరాజ్, కోడలు కీర్తన కూడా సినిమా ఇండస్ట్రీలో లోనే రాణిస్తున్నారు.

భాగ్యరాజ్ పాడే మోస్తోన్న పార్తీబన్, శరత్ కుమార్.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us