AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema: థియేటర్లలో 100 కోట్లు.. ఓటీటీలో రికార్డు వ్యూస్.. ఇప్పుడు టీవీలోకి బ్లాక్ బస్టర్ మూవీ.. టెలికాస్ట్ టైమింగ్స్ ఇవే

ఈ ఏడాది ప్రారంభంలో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఆపై ఓటీటీలోనూ రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు టీవీలోకి వచ్చేస్తోంది. ఐఎమ్ డీబీలో ఈ సినిమాకు టాప్ రేటింగ్ ఉంది.

Cinema: థియేటర్లలో 100 కోట్లు.. ఓటీటీలో రికార్డు వ్యూస్.. ఇప్పుడు టీవీలోకి బ్లాక్ బస్టర్ మూవీ.. టెలికాస్ట్ టైమింగ్స్ ఇవే
TV Cinema
Basha Shek
|

Updated on: Jun 26, 2026 | 5:37 PM

Share

వారం వారం సరికొత్త సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఈ వారం మరో సూపర్ హిట్ సినిమాను అందించేందుకు సిద్ధమైంది. కామెడీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా అందిస్తోంది. థియేటర్ వేదికగా ప్రేక్షకులను మెప్పించిన బ్లాక్బస్టర్ హిట్ అనగనగా ఒక రాజు ఈ ఆదివారం, జూన్ 28, సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో! అనగనగా ఒక రాజు సినిమా భావోద్వేగాలు, హాస్యం, కుటుంబ విలువలు, ఆకట్టుకునే కథాంశంతో రూపొందింది. కామెడీ ఎంటర్టైనర్గా అందరి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు చిన్నపెద్ద తేడా లేకుండా కుటుంబం అంతా కలిసి ఆనందించేలా టెలివిజన్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్గా నిలిచిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించగా రావు రమేష్, తారక్ పొన్నప్ప, తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఈ సినిమా కథ విషయానికి వస్తే..  గౌరవపురం జమీందార్ గోపరాజు మనవడు రాజు (నవీన్ పొలిశెట్టి). జమీందార్ మనవడు అనే పేరు తప్ప ఆస్తులేమీ మిగలకపోవడంతో రాజు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటాడు. ఎలాగైనా బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితంలో స్థిరపడిపోవచ్చని పలగటి కలలు కంటుంటాడు. ఇదే సమయంలో అతనికి చారులత (మీనాక్షి)ని చూస్తాడు.  ఆమెను పెళ్లి చేసుకుంటే కష్టాల నుంచి బయటపడవచ్చని భావిస్తాడు. ఎలాగైనా ఆమె మనసుని గెలచుకోవాలని రంగంలోకి దిగుతాడు. మరి రాజు చారులత మనసుని గెల్చుకున్నాడా? ఆమె జీవితంలోకి వచ్చాక రాజు లైఫ్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి? అసలు రాజు రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్నది తెలుసుకోవాలంటే ఈ రాజుగారి సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మారీ దర్శకత్వంలో, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఊహించని ట్విస్ట్ లతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఐఎమ్‌డీబీలో ఈ సినిమాకు పదికి 6.2 రేటింగ్ ఉండడం విశేషం. మరి ఇన్ని విశేషాలున్న ఈ సినిమాని జీ తెలుగు వేదికగా ఆదివారం మీరూ తప్పకుండా చూసేయండి!

మరో రెండు రోజుల్లో టీవీలోకి వస్తోన్న అనగనగా ఒక రాజు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్