గత్తరలేపుతున్న దృశ్యం పాప.. కుర్రాళ్ళకు నిద్రలేకుండా చేస్తున్న ఎస్తేర్...
30-06-2026
Pic credit - Instagram
Phani Ch
సాధారణంగా సినీరంగంలో చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన చిన్నారులు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా మారిన సంగతి తెలిసిందే.
'దృశ్యం' సినిమాలో విక్టరీ వెంకటేష్ చిన్న కూతురిగా క్యూట్ యాక్టింగ్‌తో తెలుగు, మలయాళ ప్రేక్షకులను మెప్పించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుంది కదా? ఆ చిన్నారే ఎస్తేర్ అనిల్.
అప్పట్లో హోమ్లీ లుక్‌లో కనిపించిన ఈ పాప, ఇప్పుడు హీరోయిన్‌గా మారి తన గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాను ఒక్కసారిగా షేక్ చేస్తోంది!
సినిమా అవకాశాలతో పాటు సోషల్ మీడియాలో నిత్యం లేటెస్ట్ క్రేజీ ఫోటో షూట్స్‌ను షేర్ చేస్తూ ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోంది.
కేరళలోని వయనాడ్ కు చెందిన ఎస్తేర్ అనిల్.. పాపనాశం చిత్రంలో కమల్ హాసన్ కుమార్తెగా నటించింది. ఆమె 2010లో మలయాళ చిత్రం నల్లవన్ లో బాలనటిగా అరంగేట్రం చేసింది.
ఎస్తేర్ మూడో తరగతిలో ఉండగానే.. మోహన్ లాల్ తో కలిసి నటించిన ‘ఒరు నాల్ వరుమ్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.
ఆ సినిమా ఆమెను అందరి దృష్టిని ఆకర్షించింది. ‘దృశ్యం’ మూడు భాషా వెర్షన్లలో నటించి తనకు పాన్-ఇండియన్ గుర్తింపు తెచ్చుకుంది.