బ్లెస్సింగ్స్ ఇస్తున్న ఫాదర్‌కి చిన్నారి హై ఫైవ్ .. వీడియో వైరల్
చిన్న పిల్లలు ఏం చేసినా చూసేందుకు చాలా ముచ్చటగా ఉంటుంది. తెలీక చేసినా, తెలిసి చేసినా చిన్న పిల్లల చేష్టలను చాలా మంది ఇష్టపడుతుంటారు

Girl High Five to Priest: చిన్న పిల్లలు ఏం చేసినా చూసేందుకు చాలా ముచ్చటగా ఉంటుంది. తెలీక చేసినా, తెలిసి చేసినా చిన్న పిల్లల చేష్టలను చాలా మంది ఇష్టపడుతుంటారు. అంతేకాదు వారి చేష్టలు పెద్దవారి ఒత్తిడిని కూడా తగ్గిస్తుంటాయి. ఇలా ఓ చిన్నారి చేసిన ఓ చిలిపి చేష్ట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇటీవల తన కుమార్తెతో కలిసి ఓ మహిళ చర్చికి వెళ్లింది. అక్కడ ఫాదర్ బ్లెస్సింగ్స్ ఇస్తూ చేయిని చూపించారు. అంతే ఆ చిన్నారి హై ఫైవ్ ఇచ్చింది. సాధారణంగా చేయి పెట్టినప్పుడు హై ఫైవ్ ఇస్తుంటారు కాబట్టి.. ఫాదర్ కూడా అలా చేయి పెట్టేసరికి ఏమీ తెలియని ఆ చిన్నారి ఆయనకు హై-ఫైవ్ ఇచ్చింది. దీంతో వెంటనే ఆ మహిళ తన చిన్నారి చేయిని పట్టుకుంది. అయితే ఆ చిన్నారి అమాయకపు చర్యకు ఫాదర్‌కి కూడా నవ్వొచ్చింది. అంతే మరో చేత్తో తన నోటికి అడ్డుపెట్టుకొని నవ్వును ఆపుకుంటూ వారికి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దీన్ని చూసిన నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.
Read More:
Breaking: 139 మందిపై అత్యాచారం కేసు.. డాలర్ బాయ్ అరెస్ట్
పది రోజుల్లో బయటకు రానున్న చిన్నమ్మ..!
Father is saying a blessing.
The innocence of a child.
They’re trying not to laugh.
Best thing you’ll see today… pic.twitter.com/8ueI8JLhnf
— Rex Chapman?? (@RexChapman) October 21, 2020