Watch: ఛీ..ఛీ.. వీడేం మనిషి.. ఈ ఫుడ్ డెలివరీ బాయ్ చేసిన పని చూస్తే జన్మలో ఆన్‌లైన్ ఆర్డర్ పెట్టరు.. తినరు..!
బస్ కోసం ఎదురుచూస్తున్న టైం లో డెలివరీ బాయ్ ప్రతి ప్యాకెట్ ఓపెన్ చేసి ఏదో చేస్తున్నట్లు కనిపించిందని చెప్పాడు. దగ్గరికి వెళ్లి చూసే సరికి.. ప్రతి ప్యాకెట్ లో ఉమ్మి వేస్తున్నాడు. ఆ తర్వాత మళ్లీ వాటిని ప్యాక్ చేస్తున్నాడు. వీడియో తీస్తూ నేను దగ్గిరికి వెళ్లడం చూసీ వెంటనే పారిపోయాడు అని చెప్పారు. రాకేశ్ సింహ అనే వ్యక్తి వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం ప్రజలు ఆన్‌లైన్ ఆర్డర్లకు విపరీతంగా అలవాటుపడిపోయారు.. అలాంటి వారికి ఈ వార్త నిజంగానే భయపెట్టేదని చెప్పాలి. కొందరు ఆన్‌లైన్ ఫుడ్ డెలివీరీ బాయ్స్ పైశాచికత్వానికి పరాకాష్టగా కనిపిస్తుంది. ముంబైలోని కంజుర్‌మార్గ్‌లో జరిగిన ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. జొమాటో డెలివరీ బాయ్ ఫుడ్ పార్శిళ్లపై ఉమ్మి వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాలీవుడ్ సంగీత స్వరకర్త నారాయణ పార్వతి పరశురామ్ ఈ చర్యను చూసి తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ వీడియోలో డెలివరీ బాయ్ ఆహార ప్యాకెట్లను తెరిచి, వాటిపై ఉమ్మివేసి, వాటిని తిరిగి ప్యాక్ చేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సంఘటన ఆహార పంపిణీ సేవల భద్రత, పరిశుభ్రత గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. జొమాటో ఈ సంఘటనను ఖండించింది. దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చింది.
ఈ సంఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఫుడ్ డెలివరీ సేవలను విశ్వసించవచ్చా అని చాలా మంది వినియోగదారులు ప్రశ్నించారు. డెలివరీ బాయ్స్ నేపథ్య తనిఖీలు, పరిశుభ్రతకు సంబంధించి కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు.
Narayan Parvathy Parasuram, Bollywood music composer: “Waiting at the Huma Kanjurmarg bus stop in Mumbai, my sight fell upon this Zomato guy opening each one of his food packages and doing something. On looking closely, I realised that he was spitting in each of the packages and… pic.twitter.com/6DXOc1fGvs
— Rakesh Krishnan Simha (@ByRakeshSimha) March 28, 2025
కాగా, వీడియో తీసిన నారాయణ్ ఈ ఘటన గురించి.. ‘‘ముంబైలోని హుమా కంజుమార్గ్ లో బస్ కోసం ఎదురుచూస్తున్న టైం లో డెలివరీ బాయ్ ప్రతి ప్యాకెట్ ఓపెన్ చేసి ఏదో చేస్తున్నట్లు కనిపించిందని చెప్పాడు. దగ్గరికి వెళ్లి చూసే సరికి.. ప్రతి ప్యాకెట్ లో ఉమ్మి వేస్తున్నాడు. ఆ తర్వాత మళ్లీ వాటిని ప్యాక్ చేస్తున్నాడు. వీడియో తీస్తూ నేను దగ్గిరికి వెళ్లడం చూసీ వెంటనే పారిపోయాడు అని చెప్పారు.
రాకేశ్ సింహ అనే వ్యక్తి వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశాడు. కంజుర్ మార్గ్ ఏరియాలో డెలివరీ బాయ్ చేసిన ఈ చండాలమైన పనికి నెటిజన్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..