పది రోజుల్లో బయటకు రానున్న చిన్నమ్మ..!
పది రోజుల్లో శశికళ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు చిన్నమ్మ న్యాయవాది రాజా చెందూర్ పాండియన్ అన్నారు

Sasikala Karnataka Jail: పది రోజుల్లో శశికళ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు చిన్నమ్మ న్యాయవాది రాజా చెందూర్ పాండియన్ అన్నారు. ఆమె విడుదల అయ్యేందుకు జరిమానా మొత్తం రూ.10కోట్ల 10 వేలు సిద్ధం చేశామని తెలిపారు. తన న్యాయవాది రాజాచెందూర్ పాండియన్‌కు శశికళ ఆదివారం ఓలేఖ కూడా రాశారు. ఆ లేఖలోని అంశాల ఆధారంగా ఈ విషయాన్ని తాను చెబుతున్నట్టు పేర్కొన్నారు.
కర్ణాటక జైళ్ల నిబంధనల మేరకు శిక్ష అనుభవించే వారికి నెలలో 3 రోజులు సత్ప్రవర్తన పరిధిలో ఉంటుందని.. ఇలా శశికళకు 129 రోజుల శిక్షా కాలం తగ్గుతుందని వివరించారు. ప్రస్తుతం కర్ణాటకలోని కోర్టులకు దసరా సెలవులు కాగా, ఈనెల 26న కోర్టులు పునః ప్రారంభం కానున్నాయని రాజా చెందూర్ తెలిపారు. ఆ తరువాత చిన్నమ్మ జైలు నుంచి విడుదల అవ్వనుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
Read More: