అప్సరసలకు సొంత సోదరి ఈ వయ్యారి భామ.. సిజ్లింగ్ ఊర్వశి.. 

21 April 2025

Prudvi Battula 

Credit: Instagram

ఊర్వశి రౌతెలా.. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఈ హరిద్వార్‌ ముద్దుగుమ్మ 2013లో 'సింగ్ సాబ్ ది గ్రేట్' సినిమాతో సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

‘సనమ్‌ రే’, ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’, ‘హేట్ స్టోరీ-4’, ‘పాగల్‌ పంతీ’, ‘వర్జిన్‌ భానుప్రియ’ సినిమాల్లో నటించి మెప్పించింది.

ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్లోనే ఈ అమ్మడి పేరు బాగా వినిపిస్తోంది.

వాల్తేరు వీరయ్యలో వేర్ ఈజ్ ద పార్టీ అంటూ తెలుగు ప్రేక్షకులను మొదటిసారి పలకరించింది బాలీవుడ్ అందాల తార ఊర్వశి రౌతెలా.

ఆ తర్వాత అక్కినేని అందగాడు యువ సామ్రాట్ అఖిల్ తో కలిసి ఏజెంట్ సినిమాలో స్టెప్పులేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇటీవల బాలీవుడ్ లో జేఎయూ అనే సినిమాలో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం వరుస బిజిబిజీగా ఉంటోంది ఊర్వశి రౌతెలా.

ఈ ఏడాది తెలుగులో బాలయ్య హీరోగా సంక్రాంతికి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ డాకు మహారాజ్‎లో కనిపించింది ఈ బ్యూటీ.

ప్రస్తుతం తెలుగులో బ్లాక్ రోజ్ అనే మూవీ చేస్తుంది. దీంతో పాటు హిందీలో కసూర్ 2 సినిమా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.