AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: క్యారకల్ – ఐకామ్ భాగస్వామ్యంతో అత్యాధునిక చిన్న ఆయుధాల తయారీ కేంద్రం ప్రారంభం

యుఎఇకి చెందిన ప్రముఖ చిన్న ఆయుధ తయారీదారు, EDGE గ్రూప్‌లోని ఒక సంస్థ అయిన క్యారకల్, మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) గ్రూప్ కంపెనీ అయిన ఐకామ్ టెలి లిమిటెడ్‌తో కలిసి హైదరాబాద్‌లోని ఐకామ్ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ ఫెసిలిటీలో ప్రపంచ స్థాయి చిన్న ఆయుధ తయారీ సౌకర్యాన్ని ప్రారంభించాయి.

Hyderabad: క్యారకల్ - ఐకామ్ భాగస్వామ్యంతో అత్యాధునిక చిన్న ఆయుధాల తయారీ కేంద్రం ప్రారంభం
World-class small arms manufacturing facility
Ram Naramaneni
|

Updated on: Apr 21, 2025 | 4:38 PM

Share

దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించే ప్రపంచ శ్రేణి చిన్న ఆయుధాల తయారీ కేంద్రాన్ని మేఘా ఇంజనీరింగ్ అండ్  ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL ) గ్రూప్ సంస్థ ఐ కామ్ సోమవారం ప్రారంభించింది. ఐ కామ్ సమీకృత ఇంజనీరింగ్ విభాగం ఆవరణలో ఈ ఆయుధ తయారీ కేంద్రాన్ని ఐ కామ్ టెలీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుమంత్ పాతూరు, క్యారకల్  సిఈఓ హమద్ అల్ అమెరి సంయుక్తంగా ప్రారంభించారు.

మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఇక్కడ తయారయ్యే  ఆయుధాలు భారత సాయుధ దళాలు, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFS), సాయుధ బలగాలు, రాష్ట్ర పోలీస్ బలగాలు, SPG వంటి సంస్థల కీలక అవసరాలను తీరుస్తాయి. అలాగే క్యారకల్ సంస్థ  ప్రపంచంలోని వివిధ దేశాలకు ఆయుధాల్ని ఎగుమతి  చేసేందుకు  హైదరాబాద్‌లోని ఆయుధ తయారీ కేంద్రం ఉపయోగపడుతుంది. యూఏఈ సంస్థ భారత  దేశానికి తొలిసారి చిన్న ఆయుధాల తయారీకి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తోంది.

CARACAL and ICOMM Representatives

క్యారకల్, హైదరాబాద్‌లో ఉన్న ఐ కామ్ కేంద్రంలో మిషన్-ప్రూవెన్ కార్ 816 క్లోజ్-క్వార్టర్స్ బాటిల్  రైఫిల్(5.56x45mm), లక్ష్యాన్ని చేధించగలిగే కార్ 817 అసాల్ట్ రైఫిల్(7.62x51mm),  తేలికపాటి CSR 338, 308 బోల్ట్-యాక్షన్ స్నిపర్ రైఫిల్స్, లక్ష్యాన్ని ఛేదించే అత్యంత  ఖచ్చితమైన CSR 50 బోల్ట్-యాక్షన్ యాంటీ-మెటీరియల్ స్నిపర్ రైఫిల్(12.7x99mm), ఆధునిక CMP 9 సబ్‌మెషిన్ గన్( 9x19mm), పలు రకాలుగా ఉపయోగపడే క్యారకల్ ఈ ఎఫ్, క్యారకల్ ఎఫ్ జెన్ 2 కాంబాక్ట్  పిస్టల్స్ తయారు చేస్తారు.

ఈ సందర్భంగా ఐకామ్ టెలీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుమంత్ పాతూరు మాట్లాడుతూ… ఈ కర్మాగారం భారతదేశ రక్షణ దళాలకు తమ  తిరుగులేని నిబద్ధత, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్  దృష్టిపై మా నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఐకామ్‌లో, దేశంతో పాటు ప్రపంచానికి ఉపయోగపడే విధంగా  ఆయుధాలను తయారు చేస్తున్నామని తెలిపారు. తమ ఆయుధ తయారీ  కేంద్రం కారకల్‌తో చారిత్రాత్మక సాంకేతిక బదిలీ (టి ఓ టి ) ఒప్పందం కింద అత్యాధునిక  సమగ్ర శ్రేణి ఆయుధాల తయారీ కేంద్రంగా పనిచేస్తుందని… ఇది యూఏఈ-భారతదేశ రక్షణ సహకారంలో ఒక మైలురాయిని సూచిస్తుంది అన్నారు.  విశ్వసనీయ, దూరదృష్టి గల భాగస్వామి క్యారకల్‌తో కలిసి, మేము ప్రపంచ స్థాయి ఆయుధాలను మాత్రమే కాకుండా, ధైర్యమైన, స్వయం-సమృద్ధి గల భారతదేశాన్ని నిర్మిస్తున్నామని అన్నారు. నూతన ఆయుధ తయారీ కేంద్రం భారత దేశ ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ప్రయాణంలో ఒక మూలస్తంభం, ఇది ప్రపంచ సాంకేతికతను మన దేశ  నైపుణ్యంతో మిళితం చేస్తుందని చెప్పారు. ఇది కారకల్  అంతర్జాతీయ కార్యక్రమాలకు మద్దతు ఇస్తుంది, భారతదేశాన్ని విశ్వసనీయమైన ప్రపంచ రక్షణ ఉత్పత్తి కేంద్రంగా బలోపేతం చేస్తుంది అని సుమంత్ అన్నారు.

క్యారకల్ సి ఈ ఓ హమద్ అల్ అమెరి మాట్లాడుతూ…  ఐ కామ్ క్యారకల్ చిన్న ఆయుధాల తయారీ కేంద్రం ప్రారంభం భారతీయ మార్కెట్ ,  రక్షణ పరిశ్రమకు మద్దతు ఇవ్వడానికి  తమ ప్రయత్నాలలో ఒక మైలురాయిని సూచిస్తుంది అన్నారు.  ఐకామ్ ప్రపంచ స్థాయి తయారీ నైపుణ్యం, జాతీయ స్వావలంబన పట్ల బలమైన నిబద్ధత కలిగిన అత్యంత సమర్థవంతమైన, విశ్వసనీయమైన భాగస్వామి అని నిరూపించబడింది అని అమెరి చెప్పారు .“యూఏఈ నుండి భారతదేశానికి జరిగిన మొట్టమొదటి చిన్న ఆయుధాల సాంకేతిక బదిలీ వల్లే ఐకామ్, క్యారకల్ ఆయుధ తయారీ కేంద్రం ప్రారంభం సాధ్యమైంది. ఈ కర్మాగారం ప్రధాన మంత్రి మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవకు,  మా నిబద్ధతకు నిదర్శనం. ఈ కేంద్రం ఏర్పాటు ద్వారా భారత దేశ రక్షణ వ్యవస్థలో మా పాత్రను మరింతగా పెంచుతున్నందుకు  గర్విస్తున్నాము అని” అమెరి అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….