Rana Daggubati : WWEలో పాల్గొన్న రానా.. మొట్ట మొదటి ఇండియన్ సెలబ్రెటీగా హిస్టరీ..
రెజిల్ మేనియాలో పాల్గొన్న తొలి భారతీయ సెలబ్రెటీగా చరిత్ర సృష్టించాడు టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా. నటుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా.. కొన్నాళ్లుగా సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. కానీ నిర్మాతగా సినిమాలు, వెబ్ సిరీస్ నిర్మిస్తూ అటు వ్యాపారరంగంలోనూ చాలా బిజీగా ఉన్నాడు.

టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా ప్రస్తుతం నిర్మాతగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. లీడర్ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమైన రానా.. మొదటి సినిమాతోనే అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత పలు చిత్రాలతో మెప్పించిన రానా.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. బాహుబలి చిత్రంలో భల్లాలదేవ పాత్రలో తనదైన నటనతో కట్టిపడేశారు. చివరగా సాయి పల్లవితో కలిసి విరాట పర్వం చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత ప్రొడక్షన్ రంగంలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ వ్యాపార రంగంలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రానా WWE ఫేమ్ రెజ్లింగ్ మేనియాలో కనిపించాడు. రెజ్లింగ్ మేనియా 41 ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే ఈ రెజ్లింగ్ మేనియా పోటీలను చూసేందుకు రానా వెళ్లాడు. డబ్ల్యూడబ్ల్యూఈ చూసేందుకు వెళ్లిన మొట్ట మొదటి భారతీయ సెలబ్రెటీగా చరిత్ర సృష్టించారు రానా.
అక్కడ రానా దిగిన పలు ఫోటోలను నెట్ ఫ్లిక్స్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ రెజ్లింగ్ మేనియా లైవ్ లో చూడటానికి వెళ్లిన తొలి భారతీయ సినిమా సెలబ్రెటీగా రానా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఇక అక్కడికి వెళ్లడం గురించి రానా మాట్లాడుతూ.. “WWE 41లో ఉండడం అనేది అద్భుతమైన అనుభవం. WWE అనేది మనందరి బాల్యంలో ఒక భాగం. ఇప్పుడు దానిని ప్రత్యేక్షంగా చూడడం.. ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం.. ముఖ్యంగా WWE, రానా నాయుడు రెండింటిని నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం చేయడం సంతోషంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చారు రానా.
రెజ్లింగ్ మేనియా 41 ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. లాస్ వెగాస్ లో ఈ డబ్ల్యూడబ్ల్యూఈ జరగనుంది. ఇది కేవలం అభిమానులకే కాదు.. ప్రపంచ సంబంధాల వేడుక. ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించబడిన కార్యక్రమం ఇది. ఇందులో రానా దగ్గుబాటి హాజరుకావడం అనేది భారతీయ ప్రాతినిధ్యానికి గర్వకారణం. ఇదిలా ఉంటే రానా, వెంకటేశ్ నటించిన రానా నాయుడు సీజన్ 2 త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..




