Tollywood: ‘ఈ అందమైన జీవితాన్ని ఇచ్చినందుకు థ్యాంక్యూ’.. చిన్ననాటి ఫొటో షేర్ చేసిన 300 కోట్ల స్టార్ హీరోయిన్
ఈ మధ్యన చిన్ననాటి ఫొటోలు, త్రో బ్యాక్ పిక్చర్స్ నెట్టింట బాగా వైరలవుతున్నాయి. ముఖ్యంగా సినిమా తారల ఛైల్డ్ హుడ్ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అలా తాజాగా ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన చిన్నతనంలో అమ్మతో కలిసి దిగిన కొన్నిఫొటోలు ఇన్ స్టాలో షేర్ చేసింది.

పై ఫొటోలో తల్లితో కలిసి క్యూట్ గా ఫొటోలకు పోజులిస్తోన్న చిన్నారిని గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్. అతి తక్కువ టైంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకుంది. తనదైన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించిన ఆరు సినిమాలు రిలీజయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు ఈ బ్యూటీ కున్న క్రేజ్, డిమాండ్ ఎలాంటిదో. ఇక ఈ ఏడాది ప్రారంభంలోనే కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆమె నటించిన ఒక సినిమా ఏకంగా రూ.300 కోట్ల జాబితాలో చేరింది. అది కూడా కేవలం తెలుగు రీజియన్ పరిధిలోనే. మొత్తానికి ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్ లక్కీ ఛార్మ్. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో బిజీగా ఉండే ఈ స్టార్ హీరోయిన్ తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేసింది. అందులో తన అమ్మగారితో దిగిన చైల్డ్ హుడ్ ఫొటోస్, రీసెంట్ పిక్స్‌ను షేర్ చేసింది. పై ఫొటో అదే. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతన్నాయి. మరి ఈ ఫొటోల్లో ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు సంక్రాంతికి వస్తున్నాం మూవీ హీరోయిన్ మీనాక్షి చౌదరి. సోమవారం (ఏప్రిల్ 21) ఆమె తల్లి పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
తన అమ్మగారితో దిగిన చైల్డ్ హుడ్ ఫొటోస్, రీసెంట్ పిక్స్‌ను ఇన్ స్టాలో షేర్ చేసిన మీనాక్షి.. ‘మా హార్ట్, మైండ్, సోల్ అయినటువంటి అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంతటి అందమైన జీవితాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు.. జన్మదిన శుభాకాంక్షలు అమ్మా.. నువ్వు ఈ రోజు అండ్ ప్రతిరోజూ ఇలాగే సంతోషంగా ఉండాలని దేవుడిని మనసారా కోరుకుంటున్నాను’ అని అమ్మ ప్రేమకు అక్షర రూపమిచ్చింది. ప్రస్తుతం మీనాక్షి షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు మీనాక్షి చౌదరి అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తల్లితో మీనాక్షి చౌదరి..
View this post on Instagram
ఇక సినిమాల విషయానికి వస్తే.. మీనాక్షి చౌదరి ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి NC 24 అనే సినిమాలో నటిస్తోంది. అలాగే నవీన్ పొలిశెట్టితో కలిసి అనగనగా ఒక రాజు అనే సినిమాలోనూ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. వీటితో పాటు మరో రెండూ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయని సమాచారం.
మీనాక్షి చౌదరి లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








