జేఈఈ మెయిన్స్ విద్యార్థులకు శుభవార్త… మరిన్ని భాషాల్లో ఎగ్జామ్ రాయొచ్చు..!

జేఈఈ మెయిన్స్ రాసే విద్యార్థలకు శుభవార్త.. త్వరలో మరిన్ని భాషాల్లో పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తామని కేంద్ర సర్కార్ తెలిపింది.

జేఈఈ మెయిన్స్ విద్యార్థులకు శుభవార్త... మరిన్ని భాషాల్లో ఎగ్జామ్ రాయొచ్చు..!
Balaraju Goud

|

Oct 23, 2020 | 8:47 AM

జేఈఈ మెయిన్స్ రాసే విద్యార్థలకు శుభవార్త.. త్వరలో మరిన్ని భాషాల్లో పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తామని కేంద్ర సర్కార్ తెలిపింది. జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (జాబ్) వచ్చే ఏడాది నుంచి దేశంలోని మరిన్ని ప్రాంతీయ భాషల్లో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్ నిర్వహిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ ప్రకటించారు. నూతన జాతీయ విద్యా విధానం-2020లో భాగంగా మాతృభాష, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ట్వీట్‌ వేదికగా షేర్ చేశారు. వచ్చే ఏడాది నుంచి మరిన్ని ప్రాంతీయ భాషల్లో అభ్యర్థులు పరీక్షలకు హాజరుకావచ్చన్నారు.

కాగా, ఏయే భాషల్లో ఎగ్జామ్‌ నిర్వహించేది, సంఖ్యను మాత్రం ఆయన ప్రస్తావించలేదు. స్టేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లోకి ప్రవేశానికి నిర్వహించే ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌కు ప్రాంతీయ భాషలు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. జేఈఈ మెయిన్‌ ఆధారంగా విద్యార్థులను చేర్చుకునే రాష్ట్రాల స్టేట్‌ లాంగ్వేజ్‌ను కూడా ఇందులో పొందుపరుస్తారని తెలిపారు. ‘దూరదృష్టి’ కలిగి ఉన్నందున ఈ చర్య ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీంతో లక్షలాది మంది విద్యార్థులకు ఊరట లభించనుంది.

ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షల్లో మాతృభాషలో పరీక్ష నిర్వహించడం ద్వారా విద్యార్థులు అర్థం చేసుకునేందుకు సహాయపడుతుందని, మంచి స్కోర్‌ సాధించేందుకు దోహపడుతుందన్నారు కేంద్ర మంత్రి. ప్రస్తుతం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జేఈఈ మెయిన్స్‌ను ఇంగ్లిష్‌, హిందీ, గుజరాతీ భాషల్లోనే నిర్వహిస్తోంది. నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ప్రాంతీయ భాషలలో నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష మాత్రమే. నీట్ అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళం, తెలుగుతో పాటు ఉర్దూ భాషల్లో జరుగుతోంది. ఇక మరిన్ని బాషాల్లోనూ అందుబాటులోకి రానుంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu