ఏపీలో రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ భేటీ

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో మధ్యలో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీలతో చర్చించేందుకు

ఏపీలో రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ భేటీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 23, 2020 | 9:09 AM

Local Body Elections: కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో మధ్యలో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీలతో చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. దీనిపై చర్చించేందుకు ఈ నెల 28న వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో ఈ సమావేశం ఉంటుందని ఆ ప్రకటనలో రమేష్‌ కుమార్ వెల్లడించారు. ఎన్నికలపై రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలను సేకరించాక తదుపరి కార్యాచరణకు సంబంధించి ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో కొత్తగా 1,412 పాజిటివ్ కేసులు

Bigg Boss 4: అరియానాకు బిగ్‌బాస్ పరీక్ష.. ఊపిరి పీల్చుకున్న సభ్యులు