ప్రైమరీ స్కూల్ పిల్లలపై విష ప్రయోగం వీడియో
ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విష ప్రయోగం జరిగింది. విద్యార్థులు తాగే నీటి ట్యాంకులు, దుండగులు పురుగుల మందు కలిపారు. మధ్యాహ్న భోజన సామాగ్రిపై కూడా పురుగుల మందు చల్లారు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పాఠశాలకు వరుసగా మూడు రోజులు సెలవులు ఉండటంతో పాఠశాలలోని వంటగదికి సిబ్బంది తాళాలు వేసుకొని వెళ్లారు.
సెలవుల అనంతరం పాఠశాలకు వచ్చిన సిబ్బంది వంట చేసేందుకు పాత్రలు కడిగే సమయంలో దుర్వాసన, నురుగులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పాఠశాల హెడ్ మాస్టర్, సిబ్బంది, చుట్టుపక్కల చూడగా పురుగుల మందు డబ్బా కనిపించింది. అలాగే తాగునీటి ట్యాంకులోను పురుగుల మందు కలిసినట్లుగా సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది విద్యార్థులను తాగునీటి కుళాయిల వైపు వెళ్లకుండా చూశారు. మధ్యాహ్న భోజనం కూడా ఉండలేదు. ఈ ఘటనపై ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరైన సమయానికి పాఠశాల సిబ్బంది గుర్తించి మధ్యాహ్న భోజనం ఉండకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ధర్మపురి పాఠశాలలో దాదాపు 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరంతా విష ప్రయోగం నుంచి బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ ఘటనపై పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు మండిపడుతున్నారు. అసలు స్కూల్ పిల్లలపై విష ప్రయోగం చేయాల్సిన అవసరం ఎవరికీ ఉందని చిన్న పిల్లలు ఏం పాపం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
అమెరికాలో దారుణం.. తల్లిదండ్రులను కాల్చి చంపిన కొడుకు..ఎందుకంటే వీడియో
ఆదివారం హెయిర్ కట్ చేయిస్తున్నారా.. మీ కొంప కొల్లేరే వీడియో
సీఈవో కుటుంబాన్ని నట్టేట ముంచిన నట్టు.. వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
