ఆంధ్రావాలకు దక్కిన అదృష్టం..తొలి బంగారు లాకెట్ మణిరత్నం సొంతం
కేరళలోని శబరిమల ఆలయంలో ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు స్వామి ప్రతిమ ఉన్న బంగారు లాకెట్ల విక్రయాన్ని ప్రారంభించింది. ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను జరుపుకుంటున్న సందర్భంలో పురస్కరించుకొని దేవస్థానం బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప స్వామి బొమ్మను ముద్రించిన లాకెట్లు రెండు, నాలుగు, ఎనిమిది గ్రాములలో లభిస్తాయి.
శబరిమల గర్భగుడిలో అయ్యప్ప విగ్రహం ఉన్న బంగారు లాకెట్ ను శ్రీకాకుళం జిల్లాకు చెందిన మణిరత్నం అనే వ్యక్తి ఆన్ లైన్ ద్వారా తొలి లాకెట్ ను దక్కించుకున్నారు. మణిరత్నం నాలుగు గ్రాముల లాకెట్ ను 38600 కు కొనుగోలు చేశారు. ఆలయ గర్భగుడిలో ఉంచి పూజించిన తొలి లాకెట్ ను తమ కుమారుడు అందుకోవడం ఆనందంగా ఉందని మణిరత్నం తండ్రి కోబగాపు నారాయణ తెలిపారు. శబరిమల గర్భగుడిలో అయ్యప్ప పూజల తర్వాత భక్తులకు లాకెట్లను దేవస్థానం బోర్డు అధికారులు పంపిణీ చేస్తున్నారు. రెండు, నాలుగు, ఎనిమిది గ్రాముల బరువు ఉన్న బంగారం లాకెట్లను దేవస్థానం బోర్డు విడుదల చేసింది. రెండు గ్రాముల బంగారం లాకెట్ ధర 19300, నాలుగు గ్రాముల లాకెట్ ధర 38600, ఎనిమిది గ్రాముల లాకెట్ ధర 77200 గా నిర్ణయించారు. భక్తుల డిమాండ్ ను పరిగణలోకి తీసుకొని దేవస్థానం బోర్డు లాకెట్లను ప్రవేశపెట్టింది.
మరిన్ని వీడియోల కోసం :
అమెరికాలో దారుణం.. తల్లిదండ్రులను కాల్చి చంపిన కొడుకు..ఎందుకంటే వీడియో
ఆదివారం హెయిర్ కట్ చేయిస్తున్నారా.. మీ కొంప కొల్లేరే వీడియో
సీఈవో కుటుంబాన్ని నట్టేట ముంచిన నట్టు.. వీడియో
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
