CM Chandrababu: ప్రేమంటే ఇదే.. చంద్రబాబుకు అక్కడున్న ఇమేజ్ డిఫరెంట్.. వీడియో చూస్తే ఫిదానే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్ల ఇక్కడి ప్రజలు అభిమానమే వేరు. చూపే ఆదరణ డిఫరెంట్. 1989 నుంచి వరుసగా ఎనిమిదోసారి ఓటు వేసి అసెంబ్లీకి పంపిన కుప్పం ప్రజలకు చంద్రబాబు పట్ల అపారమైన ప్రేమ ఉంది. అంతేకాకుండా.. ఇక్కడి ప్రజలతో చంద్రబాబుకు కూడా అంతే ఆప్యాయత, ప్రేమ ఉంది..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్ల ఇక్కడి ప్రజలు అభిమానమే వేరు. చూపే ఆదరణ డిఫరెంట్. 1989 నుంచి వరుసగా ఎనిమిదోసారి ఓటు వేసి అసెంబ్లీకి పంపిన కుప్పం ప్రజలకు చంద్రబాబు పట్ల అపారమైన ప్రేమ ఉంది. అంతేకాకుండా.. ఇక్కడి ప్రజలతో చంద్రబాబుకు కూడా అంతే ఆప్యాయత, ప్రేమ ఉంది.. అయితే.. ప్రతి ఇంటా చంద్రబాబుకు స్థానం ఉంటుందని బహిరంగంగా చెప్పే నియోజకవర్గ ప్రజలు.. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను వినూత్నంగా జరుపుకున్నారు. కుప్పం ముద్దుబిడ్డగా భావించే సీఎం చంద్రబాబు బర్త్ డే రోజున.. కుప్పంకు చెందిన చిత్రకారుడు పురుషోత్తం అందరినీ ఆకట్టుకునేలా చంద్రబాబు ఫొటోను ఆవిష్కరించాడు.
వినూత్నంగా కుప్పం ప్రజలు, పార్టీ కార్యకర్తల వేలిముద్రలేసి థంబ్ ఆర్ట్ చిత్రాన్ని చిత్రీకరించారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో కుప్పంలో పుట్టిన రోజు వేడుకలు జరగగా.. కుప్పం ప్రజలు వినూత్నంగా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వందలాది మంది పార్టీ కార్యకర్తలు వేలి ముద్రలు వేసి చంద్రబాబు ఫోటో చిత్రీకరణలో భాగస్వామ్యం అయ్యారు. కాగా.. వేలి ముద్రలతో చిత్రీకరించిన చంద్రబాబు ఫొటో అందరినీ ఆకట్టుకుంది.
మగ తోడు ఉంటేనే పిల్లల్ని కనగలరా? మరి ఈ చేప సంగతేంటి?
5,300 ఏళ్ల నాడు తిన్న తిండి.. ఇంకా అరుగుతూనే ఉంది
ఆకాశంలో వింత కాంతులు! ఆత్మలా? ఏలియన్సా?
ఆకారం భారీగా.. కానీ చేతులు చిన్నవిగా? ఇజ్జత్ మొత్తం పాయె!
ప్రపంచంలోనే ఖరీదైన గ్రీన్ టీ.. కారణం ఇదే
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!

